Translate

  • Latest News

    25, నవంబర్ 2017, శనివారం

    వైకాపా కు చుక్కలు చూపిస్తున్న టిడిపి



     అంతా అనుకున్నట్లే జరుగుతుంది.   పక్కా స్కెచ్.   ఆరీతేరిన వ్యూహకర్త చంద్రబాబునాయుడు దర్శకత్వంలో 
     ప్రత్యర్థి పార్టీని దెబ్బతీసే పావులు ఒక్కక్కటిగా బయటకు తీస్తున్నారు. వైకాపా అధినేత జగన్ పాదయాత్ర మొదలు పెట్టి ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతూ, మరో హామీల వర్షం కురిపిస్తున్నారు. పాదయాత్ర మొదలు పెట్టినప్పడే చంద్రబాబునాయడు ఆధ్వర్యంలో వ్యూహం ఖరారైంది. 
    జగన్ పాదయాత్ర ఏఏ నియోజకవర్గాల్లో కొనసాగుతుందో రూట్ మ్యాప్ సంపాదించిన టిడిపి శ్రేణులు జగన్ ఆ ప్రాంతానికి చేరుకోకముందే షాక్ ఇచ్చేలా వ్యవహారాన్ని చక్కదిద్దుతున్నారు. ఆయా నియోజకవర్గాల్లో వైకాపా క్యాడర్ను టార్గెట్ చేస్తున్నారు.ప్రత్యర్థిని ఇరుకున పెట్టడానికి , క్యాడర్లో నిరాశ నిసృహను ఇంజక్ట్ చేయటానికి శతవిధాల ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇందులో భాగంగానే పార్టీలో ఉన్న వారిని ఆకర్షించటానికి ఆకార్డ్ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇప్పటికే పలువురు టిడిపి తీర్ధం పుచ్చుకోగా మరికొందరు ఇదే బాటలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. తాజా గా పాడేరు వైకాపా ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి టిడిపిలో చేరటానికి నిర్ణయించుకున్నారు.ఆమె పార్టీ అధినేత జగన్ పైనే విమర్శనాస్త్రలు ఎక్కుపెట్టారు.
     ఆంద్రజ్యోతికి కీలకపాత్ర.
     టిడిపి మానసపుత్రిక ఆంద్రజ్యోతి వైకాపా శ్రేణులను మానసికంగా దెబ్బతియటంలో సక్సస్ సాధించింది. గతంలో భిన్నస్వరంలో చెప్పకున్నట్లే (చూడు. ఆంద్రజ్యోతి ఉంది జాగ్రత్త) పాదయాత్రలో జరుగుతున్న ప్రతి తప్పను బూతద్దంలో చూపి తన స్వామి భక్తిని చాటుకుంటునే ఉంది. ఇదే క్రమంలో పెనామా పత్రాలు, ఈడీ తాలుకు విచారణ వ్యహరాన్ని బయటపెట్టింది. టిడిపిలో ఫలానా వారు చేరుతున్నారని, వైకాపా ఖాళీ అవుతుందని ప్రచారం మొదలుపెట్టింది. రాజ్యసభ సీటు కూడా ఉండదని ప్రచారం చేస్తుంది. ఈ మొత్తం ఎపిసోడ్లో ఆంద్రజ్యోతి కీలకపాత్ర పోషిస్తుందనే చెప్పాలి.
     ఆత్మరక్షణలో వైకాపా. 
    ఒకవైపు పాదయాత్రకు నానాటికి పెరుగుతున్న ఆదరణ ప్రజల నుంచి వస్తున్న స్పందన కూడా వైకాపా నాయకులకు సంతృప్తి కలిగించటంలేదు. టిడిపి నుంచి వస్తున్న ముప్పెట దాడి నుంచి ఏలా రక్షించుకోవాలన్నదానిపైనే దృష్టి పెట్టింది. విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టగల నాయకత్వం కరువైంది. కిందిస్థాయి నుంచి పార్టీ పూర్తి స్థాయిలో వ్యవస్త్రీకృతం కాకపోవటం సీనియర్లు ఉన్నా వారికి సరైన గుర్తుంపలేకపోవటం కారణాలుగా విశ్లేషిస్తున్నారు. పార్టీకి సాక్షి పేపర్ ఉన్నా అది సరైన మార్గంలో నడవటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆంద్రజ్యోతి,లేదా టిడిపి అనుకూల మీడియాలో జగన్పై విమర్శలకు పాఠకులు మెచ్చెలా సమాధానం ఇవ్వటంలోనూ విఫలం చెందుతున్నారు. ప్రతర్ధి వ్యూహాలకు ప్రతి వ్యూహాలు రచించటం, వాటిని సమర్థవంతంగా అమలు చేయటం, ప్రత్యర్థిని మానసికంగా దెబ్బతియటం రాజకీయాల్లో తప్పనిసరి. చూద్దాం. వైకాపా ఎం చేస్తుందో.

    శ్రీహర్ష


    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: వైకాపా కు చుక్కలు చూపిస్తున్న టిడిపి Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top