Translate

  • Latest News

    25, నవంబర్ 2017, శనివారం

    మళ్లి తెరపైకి అయోధ్య రగడ...


    రామ్ జన్మభూమి కేసులో సుప్రీంకోర్టు విచారణ డిసెంబరు 5 న ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రకటన మళ్ళి వివాదం రేపుతోంది. భగవత్ ఈ నెల 24న మాట్లాడుతూ అయోధ్యలోని వివాదాస్పద ప్రాంతంలో రామ్ ఆలయం, ఇతర నిర్మాణాలు మాత్రమే  నిర్మిస్తామని చెప్పారు.



    సరిగ్గా పాతికేళ్ల కిందట 1992 లో డిసెంబర్ 6 న అయోధ్యలో బాబ్రీ మసీద్ ను కరసేవకులు కూల్చడం ద్వారా రగులుకున్న భారతం ఆ తర్వాత ఏడాదికే 1993లో ముంబై పేలుళ్లతో పెద్ద మూల్యాన్నే చెల్లించుకుంది.  అయినా  బి.జె.పీ తన తీరు మార్చుకోవడం లేదు. తన రాజకీయ ప్రయోజనాల కోసం అవసరమైనప్పుడల్లా అయోధ్య అంశాన్ని వాడుకుంటూనే ఉంది. ఇప్పుడు కేంద్రంలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో రెండు చోట్లా  బి.జె.పీ ప్రభుత్వాలే ఉన్నాయి. అందునా పైన మోడీ... ఇక్కడ యోగి... ఇద్దరు కరడుగట్టిన హిందుత్వ వాదులే ఉన్నారు. వివాదాస్పద ప్రదేశంలో ఒక రామాలయాన్ని నిర్మించడానికి సిద్ధంగా ఉన్నారు. పైగా మరో ఏడాదిలో కేంద్రంలో ఎన్నికలు ఉన్నాయి.  నోట్ల రద్దు, జి.ఎస్.టి వైఫల్యాలనుంచి ప్రజల దృష్టి మరల్చాలంటే బి.జె.పీ చేతిలో రెడీగా ఉన్న ఆయుధం ఇదే... ఈ ఆయుధాన్నే ప్రయోగించి.. మరోసారి హిందువులను మానసికంగా రెచ్చగొట్టడానికి రంగం సిద్ధం చేసింది. దాని పరిణామాలు ఈ సారి ఎంత అనర్ధానికి దారితీస్తాయో... ఎంతమంది బలవుతారో... వారికి అనవసరం. వారి రాజకీయ ప్రయోజనాలే వారికి ముఖ్యం. రానున్న ఏడాది కాలంలో ఎన్ని విపరీత పరిణామాలు జరుగుతాయో... బీ.. అలర్ట్...
                                                                                                                                                 మానవేంద్ర 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: మళ్లి తెరపైకి అయోధ్య రగడ... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top