Translate

  • Latest News

    28, నవంబర్ 2017, మంగళవారం

    బోడిగుండుకు...మోకాలికి ముడిపెట్టినట్టు...


    బోడిగుండుకు...మోకాలికి ముడిపెట్టినట్టు... ఉంది తెలంగాణకు చెందిన బి.జె.పీ ఎం.ఎల్.ఏ రాజాసింగ్ పరిస్థితి. కాంగ్రెస్ నాయకుడు శశిథరూర్ పద్మావతి సినిమాను సపోర్ట్ చేశాడన్న కోపంతో దమ్ముంటే రాజీవుగాంధీ , సోనియా లవ్ స్టోరీ గురించి సినిమా తీయమని సవాల్ చేస్తున్నాడు. ఆలా చేస్తే తానూ కూడా పద్మావతి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడంట... ఇదేమి వింత వాదన... రాజాసింగ్ కు ఇది కొత్త కాదు... గతంలో ఎన్నోసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పద్మావతి సినిమాను ప్రతి హిందువు, ప్రతి రాజపుట్ బహిష్కరించాలని పిలుపు ఇచ్చారు.  అంతేకాదు హైదరాబాద్ లో ఈ సినిమాను ప్రదర్శిస్తే ఆ థియేటర్ లను తగలబెట్టమని మరి పిలుపు ఇచ్చాడు. ఈ వివాదంలోనే మాట్లాడుతూ సినిమా రంగంలో కొందరు మహిళలు తమ భర్తల్ని రోజుకు ఒకరిని మారుస్తారు అని అన్నారు. గతంలో హైదరాబాద్ లో ఓల్డ్ సిటీని మినీ పాకిస్తానుగా అభివర్ణించాడు. అక్కడ సెర్చ్ ఆపరేషన్ చేస్తే బాంబులు దొరుకుతాయని, వెంటనే సెర్చ్ ఆపరేషన్ చేయించాలని సీఎంను కోరాడు. వెస్ట్ బెంగాల్ లో రెండు జిల్లాల్లో కమ్యూనల్ గొడవలు జరిగితే అక్కడ హిందువులని మీరు గుజరాత్లో 2002 లో హిందువుల్లా తిరగబడాలని పిలుపు ఇచ్చాడు. అయోధ్యలో రామాలయం కట్టడానికి అవసరమైతే తన ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధమే అని ప్రకటించాడు. ఇలా ఎన్నో వివాదాస్పద వ్యాఖలు చేస్తూ ఎప్పుడు సంచలన ప్రకటనలు చేసే రాజాసింగ్ నోటికి తాళం వేసేవాళ్ళు లేకుండా        పోయారు.
                                                                                                                                     -ఎడిటోరియల్ డెస్క్ 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: బోడిగుండుకు...మోకాలికి ముడిపెట్టినట్టు... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top