మోడీజీ... మా తలలు ఖండిస్తామంటున్నా... వారి వ్యాఖ్యలను మీరు ఖండించరెందుకని... ఇప్పటికే పన్సారే, దబోల్కర్, కల్బుర్గి, గౌరీ లంకేశ్ వంటి మేధావులను కాల్చి చంపారు. ఇప్పుడు కమల్ హస్సన్ ను కాల్చి చంపమని మీ వందిమాగధుడు ఒకరు పిలుపునిచ్చాడు... కానీ ఇవేవి మీ చెవులకు వినపడవా. అవునులే చెవిటివాడిలా నటిస్తున్న మీ ముందు శంఖం ఊది ప్రయోజనం లేదులే. వాడెవడో అఖిల భారతీయ హిందూ మహాసభ ఉపాధ్యక్షుడట... పండిట్ అశోక్ శర్మ అట.. వాడు వాగింది విన్నారా... కమల్ హస్సన్ లాంటి వాళ్ళను కాల్చి చంపాలట... హిందూ మతాన్ని విమర్శించే వారెవరు ఈ పవిత్ర భూమి మీద ఉండటానికి వీల్లేదట... వాడొక ఫత్వా జారీ చేసేసాడు... అంతే కాదు...ఇంకొక మీ శిష్య పరమాణువు... అభిషేక్ అగర్వాల్ అట...వాడు హిందూ మహాసభ అధిపతి అట... వాడు మీరట్ లో వాగాడు... కమల్ తో పాటు అయన కుటుంబసభ్యుల సినిమాలను బహిష్కరించాలట... ఇలా ఇంకెంతమందిని కాల్చి చంపుతారు ... మీకు వ్యతిరేకంగా గొంతెత్తిన ప్రతి గుండెను కాల్చి చంపేస్తారా... చంపేయండి... ఆ శవాలను నిచ్చెన మెట్లుగా పేర్చుకుని మళ్ళీ సింహాసనం అధిష్టించాలనుకుంటున్నారా... మీ లాంటి వాళ్ళెందరో ఈ చరిత్ర గర్భంలో కలిసిపోయారన్న సంగతి గుర్తుంచుకొండి. మోదీజీ ... మీరు ఇంకా మౌనం వహిస్తే.... మీరు వారికి మద్దతు ఇచ్చినట్టే మేం భావించవలసి వస్తుంది. అధికారం శాశ్వతం కాదని గుర్తుంచుకోండి... ఈ దేశాన్ని హిందూ దేశంగా మార్చేయాలన్న మీ అంతర్గత కుట్రలకు ఇకనైనా స్వస్తి చెప్పండి. లేదంటే వచ్చే ఎన్నికల్లో మీరు మూల్యం చెల్లించక తప్పదు సుమా...
5, నవంబర్ 2017, ఆదివారం
- Blogger Comments
- Facebook Comments
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి