Translate

  • Latest News

    4, నవంబర్ 2017, శనివారం

    కేంద్రం నుంచి రాష్టానికి మరో ఎదురుదెబ్భ


    రాష్ట్ర ఇన్‌ఛార్జి డీజీపీగా ఉన్న 'నండూరి సాంబశివరావు'ను పూర్తికాలపు డీజీపీగా నియమించడానికి కేంద్రం నో చెప్పింది  మరో నెలన్నర రోజులు మాత్రమే సర్వీసు ఉన్న 'నండూరి'ని పూర్తికాలపు డీజీపీగా నియమించాలని ఆయనతో పాటు మరో ఆరుగురు ఉన్నతాధికారుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపింది. . మరో సంవత్సరం మాత్రమే సర్వీసు ఉన్న ఎస్‌వి.రమణమూర్తి,నండూరి సాంబశివరావు(డిసెంబర్‌ ఆఖరుకు రిటైర్‌కానున్నారు) మాలకొండయ్యల పేర్లు పంపడంపై  మళ్లీ తాజా జాబితాను పంపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.  ఇప్పుడు డీజీపీ సాంబశివరావు విషయంలో కూడా అదే విధంగా వ్యవహరించాలని ప్రభుత్వం భావించింది. అందుకే ఇన్నాళ్లు ఆయనను ఇన్‌ఛార్జి డీజీపీగా కొనసాగించి..మరో నెలన్నర రోజుల్లో రిటైర్‌ అయ్యే పరిస్థితుల్లో ఇప్పుడు  ఆయనను పూర్తికాలపు డీజీపీగా నియమించాలని కేంద్రాన్ని కోరింది. అయితే రాష్ట్ర ప్రభుత్వ కోరికను కేంద్రం తిరస్కరించి అర్హులైన వ్యక్తులతో నూతన జాబితాను పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలను దృష్టిలోపెట్టుకుని ఆయన ఇన్‌ఛార్జి డీజీపీ 'నండూరి సాంబశివరావు'ను సార్వత్రిక ఎన్నికలు పూర్తి అయ్యే వరకు ఉండాలని ఆశించారు. అయితే ఇప్పుడు కేంద్రం వైఖరితో 'బాబు' వేసుకున్న ప్రణాళికలు పారలేదు. ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను పరిశీలించి ఆ రాష్ట్ర డీజీపీగా మహేందర్‌రెడ్డి నియామకానికి అంగీకారం తెలిపిన కేంద్రం, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను వెనక్కు పంపడం గమనార్హం.
    మరో ఎదురుదెబ్భ .... 
    కేంద్రం నుంచి రాష్టానికి మరో ఎదురుదెబ్భ  తగిలింది . ఇప్పటికే షాకుల మీద షాకులు ఇస్తున్న కేంద్రం మరో షాక్ ఇవ్వటం తో కిందపైన పడుతున్నారు . ఆంధ్రప్రదేశ్‌ భూసేకరణ బిల్లుకు కేంద్రం బ్రేక్‌ వేసింది. అభివృద్ధి పనులకు పంటభూములను సేకరించడంపై కేంద్ర వ్యవసాయశాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. గుజరాత్‌, తెలంగాణ భూసేకరణ బిల్లులకు ఆమోదం తెలిపిన కేంద్రం, అదే తరహాలో రూపొందించిన ఏపీ బిల్లుపై మాత్రం అభ్యంతరాలు తెలపటం , ఇటీవల పోలవరం విషయంలో ఏపీ కి అభ్యంతరాలు వ్యక్తం చేయటం ఏ విధమైన సంకేతాలో ....... 

    -ఎడిటోరియల్ డస్క్ 

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: కేంద్రం నుంచి రాష్టానికి మరో ఎదురుదెబ్భ Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top