Translate

  • Latest News

    7, నవంబర్ 2017, మంగళవారం

    శతవసంతాల వేళ మరో మహా స్వప్నం కందాం...


    అక్టోబర్ విప్లవ శతవార్షికోత్సవ సంబరాల వేళ ప్రపంచ కమ్యూనిస్టు లారా ఏకం కండి. మనమంతా కలసి మరో మహా విప్లవానికి పురుడు పోసేందుకు ఒక మహా స్వప్నం కందాం. ఆ కలను సాకారం చేసుకునేందుకు ఈ క్షణం నుంచే కార్యాచరణ ప్రారంభిద్దాం. మన ఇగోలు అన్నీ తీసి పక్కన పెడదాం. చీలికలు, పేలికలైన మన ఎర్ర జెండాను మళ్ళీ కలిపి కుడదాం. సంబరాలు చేసుకోవడం సరే... తక్షణ కర్తవ్యం ఏమిటి... ఆహా.. ఓహో...అంటూ మహత్తర సోవియట్ సోషలిస్ట్ విప్లవం గురించి కీర్తి గానాలు చేయడం కాదు... ఆ మహత్తర విప్లవం నుంచి మనం గుణపాఠాలు నేర్చుకుందాం. ఆత్మావలోకనం చేసుకుందాం. మనం ఒక్కసారి మన లోకి తొంగిచూద్దాం. మన మనసుల్ని కడిగేసుకుందాం. ఒక్కసారి వెనకటి కమ్యూనిస్టులను గుర్తుచేసుకుందాం. సుందరయ్యకో... చండ్ర రాజేశ్వరరావుకో... భజన చేయడం కాదు... వారిలా మనం మన జీవితంలో ఎంతవరకు నిబద్ధతతో ఉంటున్నాం అనేది ఒక్కసారి ప్రతి ఒక్కరం మన గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచించుకుందాం. కమ్యూనిస్ట్ కావడం అంటే మిగతా రాజకీయా పార్టీలలో లాగా సభ్యత్వం తీసుకోగానే కమ్యూనిస్ట్ అయిపోరు. మన దేశంలో కమ్యూనిస్ట్ వైఫల్యం ఇక్కడే మొదలయింది.. సభ్యత్వాలు చేర్చి కమ్యూనిస్ట్ అని ముద్ర వేసి వదులుతున్నారు తప్ప... ప్రతి కార్యకర్తను ఒక నిబద్దత కల కమ్యూనిస్టుగా తీర్చిదిద్దడంలో విఫలమయ్యారు.. ఇక్కడే కమ్యూనిస్టుల పతనం ప్రారంభమైనది. కమ్యూనిస్ట్ కావడం అంటే ఒక రాజకీయ పార్టీలో కార్యకర్త మాత్రమే కాదు. కమ్యూనిజం అనేది మన జీవితంలో అన్ని పార్శ్వాలను తడిమి మన ఆలోచవా ధోరణిని సమూలంగా మార్చి మనను ఒక సరి కొత్త మనిషిగా తీర్చిదిద్దేది... పాత తరం కమ్యూనిస్టులంతా అలాగే ఉండేవారు... అందుకే వారిని చూడంగానే ... వాడు కమ్యూనిస్టురో... అంటూ మిగతా వాళ్ళు భయభక్తులతో ఉండేవారు. ఇప్పడు కమ్యూనిస్ట్ అంటే మిగతా పార్టీల కార్యకర్తల్లాగే వీళ్లూ... వాళ్ళ అవలక్షణాలన్నీ వీళ్లకు కూడా. ఈ ధోరణి నుంచి  బయటపడి ప్రతి ఒక్కరు నిజమైన కమ్యూనిస్టుగా రూపాంతరం చెంది మన దేశ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా కమ్యూనిజాన్ని అన్వయించుకుని సరికొత్త బాట పడితే... మన మరో మహా స్వప్నం ఫలిస్తుంది.

                                                                                                                                           -మానవేంద్ర 

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: శతవసంతాల వేళ మరో మహా స్వప్నం కందాం... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top