Translate

  • Latest News

    6, నవంబర్ 2017, సోమవారం

    పాదయాత్రలో ఆంద్రజ్యోతి ఉంది .బి .. అలర్ట్


     ఎట్టకేలకు జగన్ మహాసంకల్ప పాదయాత్ర మొదలైంది. పాదయాత్రకు ముందునుంచి రకరకాల ఉహాగానాలు, అధికార పార్టీ నాయకుల విమర్శలతో పాదయాత్రకు విస్తృత ప్రచారం కల్పించారు. సహజంగానే ఎం జరుగుతుందా అన్న సందోహం ప్రజల్లో నెలకొంది. పాదయాత్రకు అనుమతి లేదని పోలీస్ బాస్ చె ప్పటం, వైకాపా నాయకులు కలిసిన తరువాత అనుమతి లభించటం, ఈలోగా టిడిపి, వైకాపా నాయకుల మద్య మాటల యుద్దాలు కొనసాగాయి. హమ్మయ్య. మొత్తానికి జగన్పాదయుత్ర ప్రారంభించారు. రెండు రోజలు నుంచి టీడీపీ వారు వెనుక్కు తగ్గారు. పాదయాత్రకు తామే ప్రచారం కల్పిస్తున్నామని ఆత్మరక్షణలో పడినట్లుంది.

    పాదయాత్రను ప్రజలలోకి తీసుకువెళ్లటానికి ప్రింట్ మీడియా కవరేజ్ ఎలా ఉండో అన్న అంశం ఆసక్తిగా ఉంది. పాదయాత్రకు ముందు యాత్ర విజయవంతం కావాలని ఇడుపలపాయ,కడపదర్గాచర్చిగుడుల్లో జగన్ పూజలు, ప్రార్థనలు నిర్వహించారు. తల్లి విజయమ్మ దగ్గర అశీస్సులుతీసుకున్నారు. అన్ని పత్రికలు జగన్ ప్రార్ధనలు, యాత్ర విశేషాలు, తల్లి విజయమ్మవినతిని ప్రముఖంగానే ప్రచురించాయి. ఇందులో ఎటువంటి సందేహం లేదు. వైకాపా పత్రిక సాక్షీ అయితే ప్రంట్ పేజీ బ్యానర్ ఐటమ్ ఇవ్వటంతో పాటు అన్ని దర్గా, ఇడుపులపాయ, చర్చీలల్లో ప్రార్ధనల ఫోటోలను ప్రచురించి, తల్లి వినతిని ప్రముఖంగా ప్రచురించింది. 

    ఇక ఈనాడు పస్ట్ పేజీలోనే వార్త ఇండికేషన్ , కడప దర్గాలో ప్రార్థనలు చేస్తున్న ఫోటోను ప్రచురించింది. ఇక ఆంద్రజ్యోతి జగన్ పాదయాత్రకు అచుతూచి వ్యవహరించినట్లు కనిపిస్తుంది. ఇక్కడే జ్యోతి తాలుకు కవరేజీని ప్రముఖంగా చెప్పకోవచ్చు. మొదటి పేజీలో వార్తను ప్రచురించినా జగన్ ఒక సామాజిక వర్గానికే చెందిన వ్యక్తి అని చెప్పటానికి ప్రధాన్యత ఇచ్చారు. జగన్ చర్చీలో ప్రార్ధన చేస్తున్న ఫోటోను ప్రచురించారు. జగన్ తల్లితో ప్రార్ధన చేస్తున్న ఫోటో శిలువను హైలైట్ చేయటం విశేషం.

     అయితే ఈ ఫోటో మరేఇతర పత్రికల్లో రాలేదు. దీన్ని బట్టే జగన్ పాదయాత్రలో ఆంద్రజ్యోతి కవరేజ్ ఎలా ఉండబోతుందో ఊహించకోవచ్చు. కొన్ని పత్రికలు జనబాహుల్యం ఎక్కువ గా ఉన్న చోట ప్రత్యర్థి పార్టీకి డామేజీ కలిగించే వార్తలు ప్రచురించవచ్చు. సీఎం సభలో కుర్చీలు ఖాళీగా కనిపించటం, ప్రసంగాలు వినకుండా వెళ్లిపోవటం తదితర అంశాలు హైలేట్ చేస్తుంటారు. కాని జ్యోతి పత్రిక మాత్రం సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయటం, జగన్ నమ్మె మతాన్నే ఎక్సపోజ్  చేసి జగన్ అందరివాడు కాదు. కొందరివాడు అన్న సంకేతాన్ని ప్రజల్లో పంపే ప్రయత్నం చేసింది. ముందు ముందు పాదయాత్ర లో ఆంద్రజ్యోతి అనుసరించే కవరేజ్కు ఇది సంకేతం మాత్రమే. ఏ మాత్రం అవకాశం వచ్చినా ఆంద్రజ్యోతికి దొరికిపోయే ప్రమాదం ఉంది. బీ అలాక్ట్ జగన్ టీమ్. 

    -- శ్రీహర్ష


    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: పాదయాత్రలో ఆంద్రజ్యోతి ఉంది .బి .. అలర్ట్ Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top