Translate

  • Latest News

    16, డిసెంబర్ 2017, శనివారం

    ఈ ఏడాది దేశంలో 4,007 పత్రికలు రిజిస్టరు



    ఎన్నికలు వస్తున్నాయి . ప్రతి పార్టీకి ఒక ఛానల్ , పేపర్ అవసరంగా మారాయి . ఈ తరుణంలో కొత్త పత్రికల కోసం  ఆరాటం పెరిగింది . తాజాగా దేశంలో లక్ష పత్రికలకు 48.80 కోట్ల కాపీల సర్క్యులేషన్ ఉందని రిజిష్ట్రార్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఫర్ ఇండియా తాజాగా విడుదల చేసిన 2016-17 వార్షికనివేదిక వెల్లడించింది. 2016-17వ ఆర్థిక సంవత్సరంలో దేశంలో 4,007 పత్రికలు రిజిస్టరు అయ్యాయని కేంద్ర సమాచార,  ప్రసారశాఖ మంత్రిత్వశాఖ విడుదల చేసిన నివేదిక పేర్కొంది. దేశంలోనే అత్యధికంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 17,736 పత్రికలున్నాయి. 2016-17లో దేశంలో 3.58 శాతం మేర పత్రికలు పెరిగాయని నివేదిక వెల్లడించింది. దేశంలో హిందీ భాషలో 46,587 పత్రికలు, ఆంగ్ల భాషలో 14,365 పత్రికలు రిజిస్టరు అయ్యాయి.


    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: ఈ ఏడాది దేశంలో 4,007 పత్రికలు రిజిస్టరు Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top