ఎన్నికలకు ముందు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించకూడదని ఎన్నికల కమిషన్ నిబంధన ఉంది కాబట్టి సరిపోయింది కానీ... లేదా ఘనత వహించిన పెద్దలు పోలింగ్ కు ముందే ఎగ్జిట్ పోల్స్ తమకు అనుకూలముగా ప్రకటింపచేసి ప్రజాభిప్రాయాన్ని తమ వైపు మరల్చుకోగలరనడంలో ఎటువంటి సందేహం లేదు. కేంద్రంలో అమిత్ షా, రాష్ట్రంలో చంద్రబాబు మీడియాను మేనేజ్ చేయడంలో దిట్టలు అన్న సంగతి అందరికీ తెలిసిందే. మోడీ ఖిల్లా లాంటి గుజరాత్ లో మోడీకి ముచ్చెమటలు పోయించి ఓటమి భయం కల్పించడంతోనే రాహుల్ విజయం సాధించినట్టు లెక్క.

ఇక 18న వచ్చే ఫలితాలు కాస్త అటూ ఇటూగా రావచ్చు. అంతిమంగా పాలక పార్టీకి మెజార్టీ సీట్లు వస్తే రావచ్చు గాక... (ఎగ్జిట్ పోల్స్) నిజమనుకుంటే.... కానీ ఎగ్జిట్ పోల్స్ ఎన్నిసార్లు తారుమారు కాలేదు... రేపు గుజరాత్ లోకూడా అలా జరగకూడదని గ్యారంటీ ఏమిటి.. ఎగ్జిట్ పోల్స్ తిరగబడి కాంగ్రెస్ కు మెజార్టీ సీట్లు రావచ్చు కదా. ఫలితాలు ఎలా వచ్చినా సరే గుజరాత్ ఎన్నికలతో కాంగ్రెస్ పార్టీకి రాహుల్ సమర్ధుడైన నాయకుడని తనను తాను నిరూపించుకున్నాడు. మోడీ ఇన్నాళ్లు రాహుల్ ను పప్పు... పప్పు.. అంటూ సోషల్ మీడియా లో చేసిన తప్పుడు ప్రచారాన్ని సమర్ధంగా ఎదుర్కొని తానేమిటో లోకానికి విశదపరిచాడు. అధికారికంగా రేపు (డిసెంబర్ 16) కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించే ముందు ఇది ఆయనకు శుభ పరిణామం. ఇక గుజరాత్ లో గెలిస్తే తిరుగే లేదు. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడికి అడ్వాన్స్ కంగ్రాట్స్...
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి