Translate

  • Latest News

    14, డిసెంబర్ 2017, గురువారం

    గురి తప్పిన రాజమౌళి బాణం...

    సినిమాను సినిమాగా.... వాస్తవాన్ని వాస్తవంగా చూస్తే ఎప్పుడూ ఇబ్బంది ఉండదు... కానీ సినిమానే వాస్తవం చెయ్యాలనుకుంటే అన్ని విషయాల్లోనూ సాధ్యపడదు. ఈ విషయం కాస్త ఆలస్యంగానైనా జ్ఞానోదయం అయినట్టుంది మన చంద్రబాబు గారికి... 
    రాజధాని సెట్టింగు ల కోసం నార్మన్ ఫోస్టర్ వారు ఇచ్చిన డిజైన్ పక్కన పెట్టి మా బాహుబలి రాజమౌళి అయితే మా భేషుగ్గా డిజైన్ గీస్తాడని ఆయన్ను పిలిపించి ఎనలేని గౌరవ మర్యాదలు చేశారు. ఆయనతో పాటు, అయన కొడుకును కూడా విదేశాలకు తీసుకువెళ్లి మరీ చూపించి తీసుకువచ్చారు. తీరా రాజమౌళి గీసిన డిజైన్ మన బాబు గారికి నచ్చలేదంట... రాజమౌళి ఇచ్చిన త్రీ  డైమెన్షన్ చిత్రాలతో కూడిన చతురస్రాకారపు డిజైన్ కన్నా నార్మన్ ఫోస్టర్ వారు ఇచ్చిన డిజైన్ కే సమావేశంలో పాల్గొన్న ఎక్కువమంది ఓటేశారంట... దీంతో చివరకు మళ్ళీ నార్మన్ ఫోస్టర్ వారు ఇచ్చిన టవర్ డిజైన్ ఓ.కే చేశారు. ఈ సమావేశంలో చంద్రబాబుతో పాటు మంత్రి నారాయణ, సి.ఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర, సి.ఆర్.డి.ఏ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్,  సి.ఆర్.డి.ఏ కమిషనర్ శ్రీధర్ పాల్గొన్నారట.  బుధవారం నాడే  బాహుబలి గూగుల్ సెర్చింగ్ లో ప్రపంచంలో 7స్థానం వచ్చిందని ఒక తీపి వార్త విన్న రాజమౌళికి ఇది మాత్రం చేదు వార్త.. ఒక తీపి వార్త వెనుకే ఒక చేదు వార్త ... కలిమి లేములు... కష్ట  సుఖాలు... మంచి..చెడు ... అన్ని ఒక దాన్ని ఒకటి వెన్నంటే ఉంటాయని పెద్దలు ఏనాడో చెప్పారు కదా...                అయ్యో... పాపం... రాజమౌళి... 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: గురి తప్పిన రాజమౌళి బాణం... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top