Translate

  • Latest News

    2, డిసెంబర్ 2017, శనివారం

    అన్నీ కేంద్రం పైకే ... చంద్రబాబు వ్యూహం


    రండి.. మంచి సమయం .. ఇదే అదును ... అలవికాని హామీ లన్ని కేంద్రంపై తోసివేద్దాం . ఏపీ  సీఎం చంద్రబాబు పరిస్థితి ఇలాగే  ఉంది. ఇప్పటికే పోలవరం  విషయం రాజు కుంది . పాపం చంద్రబాబు అంతా చేయాలను కున్నాడు. కేంద్రమే అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతుంది ... అన్న పాయింట్ ను టీడీపీ మీడియా విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తూనే ఉంది . ఈ క్రమంలోనే కాపు రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వంపై నెట్టేసే నెపానికి సీఎం చంద్రబాబు వ్యూహం పన్నారు. ఇలా తీర్మానం చేసి కేంద్రానికి పంపడం ద్వారా కాపు రిజర్వేషన్లు ఏ మేరకు సాధ్యమవతాయన్న సందేహం అటు కాపు వర్గాల్లోనే కాకుండా ఇతర నిపణుల్లో వ్యక్తమవుతోంది. 

    కేంద్రం వివిధ కారణాలతో స్పందించకుంటే తమ తప్పేమీ లేదని కేంద్రానికి తీర్మానం చేసి పంపామని చెప్పకోవడమే సీఎం ఉద్దేశంగా కనిపిస్తోంది. ఎందుకంటే. ఈ నాలుగేళ్లలో మూడుసార్లు వివిధ అంశాలపైన తీర్మానాలు చేసి కేంద్రానికి పంపి ఊరుకోవడమే కానీ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా ఆయన వ్యవహరించలేకపోయారు. ఒక పక్క పోలవరం ప్రాజెక్టుపై తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి గురువారం అసెంబ్లీలో ఈ ప్రాజెక్టును కేంద్రానికి అప్పగించేస్తామని ప్రకటన చేయడంతో దీనిపై రాష్ట్రమంతా ప్రభుత్వ వైఖరిపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పోలవరం వ్యవహారంపై ప్రజల్లో తీవ్ర చర్చ సాగుతుండగానే దాని నుంచి పక్కదారి పట్టించడానికా అన్నట్లు హడావడిగా కాపు రిజర్వేషన్ల అంశాన్ని బాబు తెరపైకి తెచ్చారని అన్ని వర్గాల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాను ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. అయితే ప్రత్యేక హోదా ఇవ్వలేమని, ప్రత్యేక ప్యాకేజీని ఇస్తామని కేంద్రం ప్రకటించింది. దీనిపై కేంద్రాన్ని నిలదీయాల్సింది పోయి ప్యాకేజీని స్వాగతిసూ ప్రకటన చేశారు. ప్రత్యేక ప్యాకేజీని ఇచ్చినందుకు కేంద్రానికి ధన్యవాదాలు తెలియచేసూ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించారు. ఇదేకాకుండా జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరం ప్రాజెక్టుకు తక్షణమే నిధులు విడుదల చేయాలని, మహిళలకు చట్ట సభల్లో   రిజర్వేషన్లు కల్పించాలని శాసనభలో తీర్మానాలు చేసి పంపారు. వీటిపై కేంద్రాన్ని నిరంతరం ఒత్తిడి చేసి, గట్టిగా ప్రశ్నించాల్సిన బాబు ఏనాడూ   ఆ పని చేయలేదు  . 

    మిత్ర పక్షముగా ఉన్న కేంద్ర ప్రభుత్వం తో సంభందాలు బెడిసి కొడుతున్న సమయంలో , కేంద్రాన్ని బూచిగా చూపి తానూ చేసిన హామీలను తుంగలో తొక్కే ప్రయత్నం లో భాగం లోనే చంద్రబాబు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది . 

    మానవేంద్ర 

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: అన్నీ కేంద్రం పైకే ... చంద్రబాబు వ్యూహం Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top