Translate

  • Latest News

    3, డిసెంబర్ 2017, ఆదివారం

    ఆర్కే మార్కు రోత రాతలు


    తనకు నచ్చినడి భూతద్ధంలో చూపటం ,, నచ్చని దానిపై  బురద చల్లటం ఆంధ్రజోతి ఆర్కే కు అలవాటే.  ఇవాంక రాక.. అంతా అతి!  ... అంటూ ఆదివారం కొత్తపలుకు లో వండి వార్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె ఇవాంక ట్రంప్‌ హైదరాబాద్‌ పర్యటన సందర్భంగా మీడియా తన అజ్ఞానాన్ని వార్తల రూపంలో వండి జనానికి పంచిందని , ఇవాంక హోదాతో నిమిత్తం లేకుండా అటు ప్రభుత్వాలు, ఇటు మీడియా పోటీలు పడి మరీ ఆమెకు ప్రాధాన్యాన్ని ఇచ్చాయని తెగ భాధ పడిపోయారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన కంటే ఇవాంక పర్యటనకే అధిక ప్రాధాన్యం లభించిందని ఇది సరైన విధానం కాదని సెలవిచ్చారు. ఇవాంక ట్రంప్‌ హైదరాబాద్‌ పర్యటన విజయవంతం కావటంతో తన అక్కసు వెల్లడించారు. 

    నిజమే ఆమె తన బాస్ చంద్రబాబు ఉండే రాజ్యానికి కాక పొరుగు రాజ్యానికి  వెళ్లటమేమిటి .... చంద్రబాబు లేని పర్యటన విజయవంతం అవ్వటం మేమిటి ... ?.. హతవిధీ..   అయినా మీడియా కు బుద్ది లేదు.. మీడియా మేనేజ్ మెంట్ కింగ్ చంద్రబాబు గురించి ఒక్క ప్రస్తావన లేక పొతే ఎలా ... ఇవాంక హోదాతో నిమిత్తం లేకుండా అటు ప్రభుత్వాలు, ఇటు మీడియా పోటీలు పడి మరీ ఆమెకు ప్రాధాన్యాన్ని ఇవ్వటం తప్పు కదా ... మరి ఇంకే రాసారో మీరు తరించండి ... 

    ఇవాంక అమెరికా అధ్యక్షుడి కూతురు మాత్రమే కాదు, అందగత్తె కూడా కావడంతో మనం అధిక ప్రాధాన్యం ఇచ్చామని భావించవచ్చు. శ్వేత జాతీయులను చూస్తే మనకు ఏదో తెలియని ఆత్మన్యూనతాభావం కలుగుతుందనడానికి ఎన్నో ఉదాహరణలు చెప్పవచ్చు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనను కలవడానికి సూటు–బూటు వేసుకున్న ఎందరో వచ్చేవారు. అలా వచ్చిన వారిలో ఒక తెల్లవాడు, ఒక భారతీయుడు ఉన్నారు. సదరు భారతీయుడు తన కంపెనీకి అధిపతి. ఆయనతోపాటు వచ్చిన తెల్లవాడు ఆ కంపెనీలో పనిచేసే ఉద్యోగి! ఇది తెలియని మన అధికారులు భారతీయుడిని పట్టించుకోకుండా ఉద్యోగి అయిన తెల్లవాడికి లేచి నిలబడి మరీ సకల మర్యాదలు చేశారు.... అంటూ మరోసారి చంద్రబాబు పేరు జపించి తరించారు. 

    ఆర్కే అక్కసు ఎక్కడిదాకా పోయిందంటే ... అందగత్తె కూడా కావడంతో మనం అధిక ప్రాధాన్యం ఇచ్చామని  చెప్పటం వరకు .. ఇవాంక లో ఆర్కేకు అందం మాత్రమే కనిపించింది . ఇది ఆర్కే లాంటి పెద్ద మనిషి కి మహిళల పట్ల ఉన్న భావజాలం 

    . ఇవాంక ట్రంప్‌ జీవితాన్ని పరిశీలిస్తే  కనెక్టికట్ లో స్కూల్ ఏజ్ లో ఉండగానే… 14యేళ్ళ వయస్సులో ఇవాంక మోడలింగ్ లో జాయిన్ అయింది.  ఏడాదిలోనే ప్రముఖ మేగజైన్స్ లో ఆమె ఫోటోలు పబ్లిష్ అయ్యాయి.  క్యాట్ వాక్ షోస్ లో పాపులర్ అయింది. అప్పట్లోనే ప్రకటనల్లో కూడా నటించింది.డిగ్రీ పూర్తయిన వెంటనే 2005లో ఇవాంక ఫ్యామిలీ బిజినెస్ లో జాయిన్ అయింది.   మొదట డైమండ్ బిజినెస్ లో ఆ తర్వాత గోల్డ్ జ్యూయలరీలో లో బిజినెస్ చేసింది. బట్టలతో పాటు యాక్సెసరీస్ ను రూపొందించింది. తన పేరుతోనే షూస్, జ్యూయలరీతో పాటు హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్స్ ను మార్కెట్లోకి తెచ్చింది ఇవాంక. 2015 లోనే వంద మిలియన్ డాలర్లను  బిజినెస్ లో సంపాదించిందంటే … ఆమె కలెక్షన్స్ కు అమెరికాతో పాటు ప్రపంచ మార్కెట్ లో ఎంత డిమాండ్ ఉందో అర్థమవుతుంది. చైనాలో కూడా ఇవాంక కలెక్షన్స్ కు కాసుల వర్షం కురిసింది.  ఇప్పటికీ ఆమె బిజినెస్ చైనాలో విజయవంతంగా నడుస్తోంది.ఒక్క ఫ్యాషన్ రంగంలోనే కాదు… తండ్రి డొనాల్డ్ ట్రంప్ కు చెందిన అనేక వ్యాపారాలను ఆమె నిర్వహించారు.  లిక్కర్ బిజినెస్ తో పాటు గోల్ఫ్స్ క్లబ్స్, రిసార్ట్స్, హోటల్స్ లాంటి అనేక వ్యాపారాలు నడిపించింది. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక.. ఆయన వ్యాపారాల నుంచి తప్పుకున్నారు. కొన్నాళ్ళు ఇవాంకే ఈ బాధ్యతలు నిర్వహించింది

    మరి ఆమెలో అందమే  కనిపించటం ,అందానికి ప్రచారం లభిందనటం అవివేకం . దమ్మున్న మీడియా యజమాని ఈ లాంటి రోత రాతలు మానుకుంటే మంచిది   

    శ్రీహర్ష 


    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: ఆర్కే మార్కు రోత రాతలు Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top