చిన్న చేపల్ని పెద్ద చేపలు మింగేస్తున్నాయి.... దానిదేముంది... సృష్టి సహజమే గదా... సృష్టి రహస్యమే అది గదా.. అంటారా... మీరన్నది కరెక్టే.. కానీ.. ఈ సృష్టిలో చేపలు... పాములు లాంటి కోటానుకోట్ల ప్రాణులతో పాటు మనిషి అనే ఒక ప్రాణి ఉంది. అది సృష్టించిన ఒక సరికొత్త ప్రపంచం ఉంది. సృష్టికర్తకే దిమ్మ తిరిగే ఆవిష్కరణలు చేసిన ఘనత ఉంది. ఈ ప్రపంచంలో చిన్న చేపల్ని పెద్ద చేపలు మింగేసే పధ్ధతి సరికాదు. కానీ ప్రస్తుత సమాజంలో అదే నడుస్తోంది...

ఇంతకూ అసలు విషయానికి వద్దాం. టెలికం రంగంలో నిన్న మొన్నటి దాకా ఎయిర్ టెల్, ఐడియా, రిలయన్స్, ఓడా కంపెనీలతో పాటు ఎయిర్ సెల్, టాటా డొకమా, టెలినార్ లాంటి చిన్న కంపెనీలు కూడా బతికి బట్టకట్టేవి.

ఏడాది కిందట జియో అనే రాకాసి బల్లి వచ్చి సృష్టించిన బీభత్స కాండతో భారత దేశంలో టెలికం రంగం మొత్తం కకావికలమై పోయింది. దాని దెబ్బకు ఇక ఎయిర్ సెల్, టాటా డొకమా, టెలినార్ లాంటి చిన్న కంపెనీలతో పాటు ఓడా లాంటి ఓ మాదిరి కంపెనీ కూడా మనుగడ సాధించలేని పరిస్థితికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఓడా ఐడియాతో విలీనానికి సిద్దమైనది. ఇక టాటా డొకమా, టెలినార్ లు తమ నెట్ వర్క్ ను అప్పనంగా ఎయిర్ టెల్ కు అప్పగించేశాయి. ఎయిర్ సెల్ ఆర్.కాం తో విలీనానికి రెడీ అయింది. ఇదండీ సంగతి.. జంతు సంస్కృతి రాజ్యమేలుతున్న ఈ సమాజంలో చిన్న చిన్న కం[పెనీలకు మనుగడ లేదన్న సత్యం మరోసారి నిరూపితమైనది.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి