Translate

  • Latest News

    24, డిసెంబర్ 2017, ఆదివారం

    జగన్ ఓటమికి చంద్రబాబు మాస్టర్ ప్లాన్

    కలియుగ చాణుక్యుడు నారా చంద్రబాబు తెలివితేటల ముందు...  ప్రజలే గెలిపిస్తారంటూ పిచ్చి నమ్మకంతో జనాల్లో తిరుగుతున్న జగన్ మరోసారి బొక్కబోర్లా పడక తప్పదు. అయితే ఈసారి పడితే మళ్ళీ లేచే పరిస్థితి కూడా ఉండదు. ఆయన కల తిరగబడి... 30 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడి గానే ఉండాల్సొస్తుంది. ఏమో... అది కూడా జరగదనుకుంటా.. ఎందుకంటే అధికారం లేకుండా అన్నేళ్లు పార్టీని నడపడం కష్టం... నడిపినా ఆయన వెనుక ఎవరూ మిగలరు...  ఆయన కుటుంబ సభ్యులు తప్ప.
    ఇంతకూ విషయమేమిటంటే... 2019 ఎన్నికల్లో గ్యారంటీగా గెలుస్తానని జగన్ నమ్మకంతో ఉన్నాడు. చంద్రబాబుపై ప్రజల్లో ఉన్న అసమ్మతే తనను గెలిపిస్తుందని ఆయన నమ్మకం. అయితే      అపర చాణుక్యుడైన చంద్రబాబు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చడానికే పవన్ కళ్యాణ్ ను జగన్ కు పోటీగా రంగంలోకి దింపాడు. ఆయనకు ఎలాగు నటన అలవాటే కాబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టు నటిస్తున్నాడు. [పవన్ ద్వారా జగన్ కు పడే ఓట్లు చీల్చే ఎత్తుగడ ఇది. చంద్రబాబు ఇంతటితో చాల్లే అని ఊరుకునే రకం గాదు. గెలుపుకి ఎన్ని అవకాశాలుంటే అన్నీ  ఉపయోగించి ఎలాగయినా గెలిచి తీరే రకం.
    అందుకే ఒక్క పవన్ కళ్యాణ్ నే నమ్ముకోకుండా  మరిన్ని ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చడానికి వామపక్షాలను పవన్ తో జత కట్టేలా వెనుక ఉండి  కధ  నడిపిస్తున్నాడు. దాదాపుగా ఆ ప్లాన్ సక్సెస్ అయినట్టే. ఆ విధంగా వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నిర్దేశకత్వంలో తృతీయ ప్రత్యామ్నాయంగా పవన్ కళ్యాణ్, సి.పి .ఐ , సి. పి .ఎం కలసి పోటీచేసి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను మాక్సిమం చీల్చి...  జగన్ కు పడకుండా చేస్త్తాయి.  ఫైనల్ గా మళ్ళీ బాబు గారిని మరోసారి అధికార పీఠం పై కూర్చోబెట్టడానికి తమ వంతు సహకారం శాయశక్తులా అందిస్తాయన్న మాట.

    వామపక్షాలు క్షమించాలి. ఈ ప్లాన్ వారికి తెలిసి జరగకపోవచ్చు. బాబు పన్నిన ఉచ్చులో వారు ఆలా బిగిసిపోతారంతే. దానికి తోడు జగన్ స్వయంకృతాపరాధం కూడా ఉంది  ఆయన వామపక్షాలను దగ్గరకు రానీయక పోవడం. దీంతో వామపక్షాలు అటు బాబుతో కలవలేక, ఇటు జగన్ రానీయక... విధిలేని పరిస్థితుల్లో పవన్ తో కలుస్తారు. ఆ తర్వాత... ఇక జరగబోయేది  పైన చెప్పిన కధే... ఈ విధంగా జగన్ తన మూర్ఖత్వంతో మరో సారి ఓటమి చవిచూడనున్నాడహో..... 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: జగన్ ఓటమికి చంద్రబాబు మాస్టర్ ప్లాన్ Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top