Translate

  • Latest News

    25, డిసెంబర్ 2017, సోమవారం

    ఇక అధికారులపై చంద్రబాబు టార్గెట్

    భిన్నస్వరం వినిపిస్తే వేటే... 
    ఏ ఒక్కరూ భిన్నస్వరం వినిపించటానికి వీలులేదు. అంతా ఇక ప్రభుత్వ భజన చేయాల్సిందే. మీకు పచ్చచొక్కాలు వేసుకొన్న నాయకులే బాస్ లు. నియమాలులేవు..నిబంధనలు లేవు. చెప్పింది చేయండి. లేకపోతే మీరు ఇంటికే...  ఇకపై  రాష్ట్ర ప్రభుత్వ తీరు ఇలాగే ఉండబోతోంది. అవును ఇది నిజమే. 
    అధికారపార్టీ అనధికార పత్రిక ఆంద్రజ్యోతిలో ప్రభుత్వం నుంచి అందిన లీకును అందంగా వార్తా కథనంగా తీర్చిదిద్దారు. కేంద్రం, పక్కన ఉన్న తెలంగాణా అధికారులపై ,వారి కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతుంటే ఏపీలో మాత్రం పాపం అటువంటి పరిస్థితి లేదంటా..? ఇందులో భాగంగానే ఐఏఎస్ లు  మొదలు కిందిస్థాయి సిబ్బంది వరకు ప్రభుత్వంపై వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, ఇందుకే ఇక మెతక వైఖరి  పనికిరాదంటూ నిర్ణయం తీసుకున్నట్లు ఈ కథనంలో ముఖ్య సారాంశం. ఇది పైకి కనిపించే కథ. చాప కింది నీరులా అధికారులపై పెత్తనం ఎప్పడో ప్రారంభమైంది. మాట వినకపోతే తహసీల్దార్ వనజాక్షిపై దాడిచేసిన ఘటన మరవలేం. రవాణా శాఖ కమిషనర్ పై ప్రజాప్రతినిధులు ఎలా విరుచుకు పడ్డారో చూసాం. చెప్పినట్లే చేయాలి. రూల్స్ మాట్లాడకూడదు. .అని ఎప్పడో సీఎం చంద్రబాబునాయుడు అధికారులకు మార్గనిర్దేశం చేశారు. 
     రాష్ట్రంలో అక్కడక్కడా కొంతమంది అధికారులు ముక్కుసూటితనంగా వ్యవహరిస్తున్నారు. ఇందువల్ల పార్టీ క్యాడర్ దెబ్బతింటుంది. సంపాదించుకోవటానికే కదా అధికారంలోకి వచ్చాం, మద్యలో వీరి బోడి రూల్స్ ఎంటి అని కొంతమంది అధికారులపై నాయకులు, ఎమ్మెల్యేలు అధినేత వద్ద వాపోయారనుకుంటా. అందుకే ఇక  మాట వినని అధికారులను టార్గెట్ చేయనున్నారు. ఈ విషయం ముందుగా ప్రజలకు తెలియజేయటానికి, ఒక రకంగా అధికారులను అదుపులో ఉండాలని హెచ్చరించటానికి ఆంద్రజ్యోతి తన పని తాను చేసుకుపోయింది. ఇప్పటికే డ్వాక్రా సంఘాలు, అంగన్వాడీలు, బీఎల్వోలు ప్రజలతో ప్రత్యేక్ష సంబంధం ఉన్న వారికి ప్రత్యేక ఆదేశాలు అందాయి. తమ పరిధిలో ఎవరు అధికార టీడీపీకి మద్దతుదారులో, ఎవరు వ్యతిరేకంగా ఉన్నారో వారి జాబితాను సేకరించి అందజేయాలి. వ్యతిరేకంగా ఉన్నవారికి ప్రజాసంక్షేమ పథకాలు, ఇతర ప్రభుత్వ ప్రయోజనాలు అవసరమైతే నిలిపివేసి తమ దారిలోకి  తెచ్చుకోవాలన్న రహస్య కుట్ర ప్రస్తుతం కొనసాగుతూనే ఉంది. సిబ్బంది సరే అధికారులను దారికి తెచ్చుకోవటానికి దండోపాయాలను ప్రయోగించటానికి ప్రభుత్వం సిద్ధమైంది. చివరగా ఇక్కడ ఒక్క విషయం ప్రస్తావించుకోవాలి. గతంలోనూ అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులపై చంద్రబాబునాయుడు సర్కార్ సాగించిన అణిచివేత దోరణి వల్లనే పది సంవత్సరాలు ప్రతిపక్షంలో కూర్చొన్నారన్న విషయం మరవరాదు. చూద్దాం అధికారులు, ఉద్యోగులు ఏ విధంగా రియాక్ట్ అవుతారో.
    ఎడిటోరియల్ డెస్క్

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: ఇక అధికారులపై చంద్రబాబు టార్గెట్ Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top