Translate

  • Latest News

    27, డిసెంబర్ 2017, బుధవారం

    లేటుగా వచ్చినా లేటెస్టుగా వస్తాడా...

    రాజకీయ రంగ ప్రవేశంపై ఎప్పుడు అడిగినా ఏదో ఒక సినిమా డైలాగ్ చెప్పి దాటవేసేవాడు రజనీకాంత్. దేవుడు ఆదేశిస్తే ఈ జీవుడు అమలుచేస్తాడు... అనేవాడు. ఆ దేవుడిని త్వరగా ఆదేశించమని... మా దేవుడిని ప్రజలందరికీ దేవుడిని చేయమని ఆయన అభిమానులు గత దశాబ్ద కాలంగా దేవదేవుడిని వేడుకుంటూనే ఉన్నారు.
     సహజంగా ఆధ్యాత్మిక చింతనాపరుడైన రజనీ కాంత్ సాక్షాత్తూ బీజేపీ అధినాయకుడు ఆఫర్ ఇచ్చినా పట్టించుకోలేదు. కొద్దీ నెలలు క్రితం ఆయన అనుంగు సహచరుడు, ప్రియ మిత్రుడు కమల్ హాసన్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నట్టు ప్రకటించినప్పుడు కూడా రజనీ తన మనసులో మాట వెల్లడించలేదు. రాజకేయాలపై ఆయన ప్రకటనలతో జనం విసిగిపోయారు కానీ ఆయన అభిమానులు మాత్రం కొండంత ఆశతో ఎదురుచూస్తూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా రజనీ మళ్ళీ అభిమానులతో సమావేశాలు ప్రారంభించాడు. రాజకీయ రంగ ప్రవేశంపై డిసెంబర్ 31 న స్పష్టత ఇస్తానన్నాడు. తనకు రాజకీయాలు కొత్త కాదని.... 1996 లోనే రాజకీయాల్లోకి వచ్చానని స్టేట్మెంట్లు ఇచ్చాడు. రాజకీయాలు గురించి బాగా తెలుసు కాబట్టే తొందరపడటం లేదన్నాడు. నిజమే... జీవితంలో ఢక్కామొక్కీలు తిన్నవాడు... కండక్టర్ స్థాయి నుంచి సూపర్ స్టార్ గా ఎదిగినోడు ... ఎంత ఎదిగినా  ఒదిగి ఉండేవాడు... చిన్ననాటి కష్టాల్లో తోడున్న స్నేహితులను మరువనోడు ... భౌతిక సుఖాలపై మోజు లేనివాడు... ఇన్ని సుగుణాలున్న వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే మంచిదే.. కానీ కుట్రలు.. కుతంత్రాలకు నిలయమైన కుళ్ళు రాజకీయాల్లో ఎంతవరకు నెగ్గుకొస్తాడనేదే ప్రశ్న.. అయితే బాషా సినిమా లో తాను చెప్పినట్టుగానే మంచివాడు మొదట కష్టపడవచ్చు...కానీ ఓడిపోడు . చెడ్డవాడు మొదట సుఖపడవచ్చు...కానీ ఓడిపోతాడు.... అని... అన్నీ తెలిసే బేరీజు వేసుకునే ఆచి తూచి వ్యవహరిస్తున్నారు...నిన్న ఆయన మాటల్లోనే చెప్పాలంటే... యుద్ధంలో దిగితే గెలుపే లక్ష్యం కావాలి.  యుద్ధంలో గెలవాలంటే వీరత్వం ఒక్కటే చాలదు...వ్యూహం  సో ... 31 న ఆయన ప్రకటన కోసం ఎదురు చూడడమే తరువాయి.... 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: లేటుగా వచ్చినా లేటెస్టుగా వస్తాడా... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top