Translate

  • Latest News

    5, జనవరి 2018, శుక్రవారం

    పందెం... కోడి పందేలు ఆపలేరని...

    సారీ... క్షమించాలి. ఈ మాట నేను అంటున్నందుకు... ఇది నేను కోర్టు ఆదేశాలను కించపరచడానికి అనడం లేదు... న్యాయ వ్యవస్థ మీద అచంచల విశ్వాసం ఉంది. కానీ... కోడి పందేలు నిర్వహిస్తే  తీవ్ర పరిణామాలు.... రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు హెచ్చరిక ... అన్న వార్త చూసి ఇది జరిగే పనేనా... అనే అనుమానం వచ్చింది. పైగా  అధికారులు కళ్ళు మూసుకున్నా... న్యాయస్థానాలు కళ్ళు మూసుకోవని... తమ ఆదేశాలు ఉల్లంఘిస్తే రాష్ట్ర ప్రభుత్వ  సి.ఎస్. డి.జి.పీ ల పై చర్యలు తీసుకుంటామని, దీన్ని తేలికగా తీసుకోవద్దని మరీ  హెచ్చరించింది. పాపం... ఇక్కడా బలయ్యేది అధికారులేనా... అనిపించింది. అన్ని వ్యవస్థలను తమ గుప్పెట్లో పెట్టుకుని ఆడిస్తున్న పాలకులపై ఎటువంటి చర్యలు ఉండవా... నాకున్న పరిజ్ఞానం మేరకు ప.గో. జిల్లాలో కోడి పందేలు ఆపడం ఆ బ్రహ్మదేవుడి తరం కూడా కాదు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా... సి.ఎస్., డి.జి.పీ లు గా ఎవరున్నా... సంక్రాంతి పండుగకు కోడి పందేలు జరిగి తీరుతాయి. ఇది ఆ పందేల నిర్వాహకులకున్న పట్టుదల... ఇన్ని దశాబ్దాలుగా వారు ఎందరో ముఖ్య మంతుల్ని, సి.ఎస్., డి.జి.పీ లు, ఎస్.పీ లను చూసారు. ఆ జిల్లాలో ఎంత మొనగాడు లాంటి ఎస్.పీ ఉన్నా ఆ పందేలు జరిగే పది రోజులు సెలవు పెట్టి ఫ్యామిలీ తో విహార యాత్రకు వెళ్ళొస్తారు. వచ్చిన తర్వాత మళ్ళీ యధా ప్రకారం తమ పని తాము చేసుకుంటారు. అంతే తప్ప ఆ చీమల పుట్టలో వేలు పెట్టి కుట్టించుకోరు. లేదా వీధుల్లోనే ఉంటే ఏదో నామ మాత్రం దాడులు చేస్తారు... మేము శాయశక్తులా  కోడి పందేలు జరగకుండా ప్రయత్నం చేశామని ప్రకటనలు ఇస్తారు. ఇది ప్రతి ఏడాది జరిగే తంతే...
    అసలు కోడి పందేలు అనేది ఇంత ప్రతిష్టాత్మకంగా మారడానికి కారణం... కోడి పందేల సంప్రదాయం మనం పలనాటి చరిత్రలో విన్నాం కదా... బ్రహ్మనాయుడు తెలంగాణ నుంచి మాచర్లకు వలస వచ్చిన వెలమ దొర ల సామాజిక వర్గానికి చెందిన వాడు. ఆయన హయాం నుంచి కోడి పందేలు వేయించడం అనేది ఆ సామాజిక వర్గానికి సంప్రదాయంగా మారింది. నాగమ్మ తెలంగాణ ప్రాంతం నుంచి వలస వచ్చిన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మహిళ. వెలమల కోడి పందేల వీక్నెస్ కనిపెట్టే కుయుక్తులతో ఓడించింది. ఇది పల్నాటి చరిత్ర. ఎవరూ కాదనలేని వాస్తవం.
     పశ్చిమ గోదావరి జిల్లాల్లో ప్రధానమైన రెండు సామాజిక వర్గాల వారు కోడి పందేలు వేయించడం అనేది తరతరాలుగా వస్తున్న తమ కుల సంప్రదాయంగా భావిస్తున్నారు. . కృష్ణా జిల్లాలో నూజివీడు ప్రాంతంలో, ప.గో. జిల్ల్లాలో చింతలపూడి పరిసర ప్రాంతాల్లో ఉన్న వెలమ దొరలూ, అలాగే భీమవరం ప్రాంతంలో ఉన్న రాజులు ఈ రెండు కులాల వారు కోడి పందేలను తమ సంప్రదాయంగా భావిస్తూ, అది తమ ప్రతిష్టగా తీసుకోవడంతో ఇంత ప్రాధాన్యత సంతరించుకుంది. మిగతా రోజుల్లో ఈ రెండు సామాజిక వర్గాల వారు ఎవరి జోలికి పోరు... తమ పనేదో తాము చేసుకుంటారు.  సంక్రాంతి పండగప్పుడు మాత్రం అధికారంలో ఎవరున్నా, అధికారులుగా ఎవరున్నా తమ పంతం నెగ్గించుకుంటారు. అందుకోసం అవసరమైతే ఢిల్లీ దాకా వెళతారు. ఈ సారి కూడా అదే జరగబోతొంది... ఆలా కాకుండా వేరే విధంగా జరిగితే చరిత్ర తిరగ రాసినట్టే...
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: పందెం... కోడి పందేలు ఆపలేరని... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top