Translate

  • Latest News

    28, ఫిబ్రవరి 2018, బుధవారం

    పీఠాన్ని సేవా మార్గం వైపు నడిపించిన జయేంద్ర సరస్వతి


    తమిళనాడులో 1935 జులై 18 న ఓ సామాన్య బ్రాహ్మణ  కుటుంబంలో జన్మించిన సుబ్రమణ్యం  మహాదేవ అయ్యంగార్ తన 18 వ ఏట సన్యాసం స్వీకరించి జయేంద్ర సరస్వతి స్వామిగా మారి ఘనత వహించిన కంచి కామకోటి పీఠానికి భావి పీఠాధిపతిగా ప్రకటించబడ్డాడు. నడిచే డైవమ్ గా భావించే అప్పటి పీఠాధిపతి చంద్రశేఖర సరస్వతి స్వామి 1994 లో శివైక్యం చెందాక జయేంద్ర సరస్వతి స్వామి కంచి కామకోటి పీఠాధిపతి అయ్యారు. అప్పటినుంచి పీఠాన్ని కేవలం ఆధ్యాత్మికంగానే కాకుండా సేవా మార్గం వైపు మరలించారు. హిందువుల్లో ఉన్న అట్టడుగు వర్గాల వారు క్రిస్టియానిటీ వైపు ఆకర్షితులవడానికే ప్రధాన కారణం వారు విద్యాలయాలు, వైద్యాలయాలు నెలకొల్పడం  అని గ్రహించిన జయేంద్ర సరస్వతి  పీఠం తరపున కేవలం  ఆలయాలే  కాకుండా విద్యాలయాలు, వైద్యాలయాలు, శంకర నేత్రాలయాలు, వృద్ధాశ్రమాలు, గోసంరక్షణాలయాలు ఏర్పాటుచేసారు.  అభినవ శంకరునిగా పేరు పొందారు. అయితే ఆయన జీవితంలో  కంచి లోని వరద రాజా పెరుమాళ్ ఆలయం మేనేజర్ శంకర్ రామన్ హత్య కేసు మాయని మచ్చగా మిగిలిపోయింది 2004 లో జరిగిన ఈ ఘటన 2500 ఏళ్ళ చరిత్ర కల పీఠానికి చెడ్డ పేరు తెచ్చింది. స్వామిజి కూడా కటకటాల పాలు కావాల్సివచ్చింది.  ఎట్టకేలకు ఆ కేసు 2013 లో కొట్టివేసినప్పటికీ మచ్చ మచ్చ గానే ఉండిపోయింది. 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: పీఠాన్ని సేవా మార్గం వైపు నడిపించిన జయేంద్ర సరస్వతి Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top