Translate

  • Latest News

    30, మార్చి 2018, శుక్రవారం

    నిన్నెలా నమ్మేది చంద్రబాబూ...


    రాజధానికి పెట్టుబడులు పెట్టండి... మీ పెట్టుబడులకు నాది భరోసా అంటున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. గత సీజన్లో (1995-2004) ముఖ్యమంత్రిగా చేసినపుడు ఈ రాష్ట్రాన్ని ఒక కంపెనీగా... తానూ ఆ కంపెనీకి సి.ఈ,ఓ లా వ్యవహరించిన చంద్రబాబు ఇప్పుడు మళ్ళీ అదే పాత్ర పోషించడానికి సంసిద్ధులయ్యారు. మళ్ళి ఆయనే నేను మీకు పట్టిసీమ కట్టించబట్టే మీ సాగు నీరు వచ్చి పంటలు పండాయి. కాబట్టి మీరంతా తలా ఒక బస్తా రాజధానికి విరాళంగా ఇవ్వండి అంటున్నాడు. మొన్న రాజధానికి భూములిమ్మన్నాడు... ఇవ్వకపోతే నయానా..భయానా బెదిరించి మరీ తీసుకున్నాడు. ఇచ్చిన వారికి అవిగో మీ ప్లాట్లు అని అరచేతిలో వైకుంఠం చూపించాడు. తీరా చూస్తే అక్కడ తుప్పలు, కంపచెట్లు తప్ప ఇంకేవి లేవు. అభివృద్ధి చేయకుండా ఇస్తే మేము రిజిస్టర్ చేయించుకోమని రైతులు అడ్డం తిరుగుతున్నారు.   నిన్న రాజధానిలో రోడ్లు వేయాలి.. పొలాలు ఇమ్మన్నాడు. ఇవ్వనన్న రైతుల పొలాల్లో వాళ్లకు చెప్పా పెట్టకుండా బలవంతంగా రోడ్లు వేయించేస్తున్నాడు. ఇప్పడు మళ్ళీ రాజధానికి పెట్టుబడులు పెట్టండి అంటున్నాడు. నిన్నెలా నమ్మాలి చంద్రబాబు అని జనం అడుగుతున్నారు. ఇంతకు ముందు రాజధానికి వచ్చిన విరాళాల లెక్కలు చెప్పి మళ్లి అడిగితే జనం కాస్తన్నా విశ్వసిస్తారు. విరాళాల లెక్కలు చెప్పరు... కేంద్రం ఇచ్చిన నిధులకు లెక్కలు చెప్పరు. మళ్ళీ  మాట్లాడితే నేను నిప్పు అంటారు. లెక్కలు అడిగినోళ్లను మాత్రం ఎదురు దాడి చేసి నోరేసుకుకు పడతారు. 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: నిన్నెలా నమ్మేది చంద్రబాబూ... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top