Translate

  • Latest News

    31, మార్చి 2018, శనివారం

    అమెరికా వెళ్లాలనుకుంటున్నారా...


    మీరు అమెరికా వెళ్లాలనుకుంటున్నారా... అయితే జాగ్రత్త కనీసం ఇప్పటినుంచి అయినా సోషల్ మీడియాలో ట్రంప్ కు వ్యతిరేకంగా పోస్ట్ లు ఏమి పెట్టమాకండి. వేరే వాళ్ళు ఎవరన్నా పెట్టినా గబుక్కున అలవాటులో పొరపాటుగా లైక్ లు కొట్టేయమాకండి. ఎందుకంటే గౌరవనీయులైన మన ట్రంప్ మహాశయుల వారు హెచ్ 1- బీ వీసా కు కొత్త నిబంధనలు ప్రవేశపెట్టారు మరి. అవేమిటంటే  హెచ్ 1- బీ వీసా కోసం ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు పెట్టడానికి వీలు లేదు. అలా పెడితే మొత్తం దరఖాస్తులన్నీ తిరస్కరిస్తారు. అంతేకాదు  హెచ్ 1- బీ వీసాదారుల భాగస్వాములకు ఇచ్చే  హెచ్ 4 వీసాను కూడా రద్దు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.  హెచ్ 1- బీ వీసాపై వచ్చి అమెరికాలో శాశ్వత నివాసం కోసం ఏర్పాటుచేసుకోవాలని ఎదురుచూస్తున్న వారి జీవిత భాగస్వామ్యుల కోసం 2015 లో ఒబామా ప్రభుత్వం  హెచ్ 4 వీసా ప్రవేశ పెట్టింది. దీనిని ఇప్పుడు రద్దు చేయాలనీ ట్రంప్ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. 
    వీటన్నిటికంటే ముఖ్యమైన విషయమేమిటంటే మీరు కనుక  హెచ్ 1- బీ వీసా కోసం దరఖాస్తు చేసుకుంటే మీ పాత మొబైల్ నంబర్, మీ ఈ మెయిల్ వివరాలు, మీ సోషల్ మీడియా వివరాలు వారికి సమర్పించాల్సి ఉంటుంది. వారు గత ఐదేళ్లుగా మీరు మీ పేస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్ లలో ఏ ఏ పోస్టింగులు పెట్టారో క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. అమెరికాకు ముప్పు కలిగించే వ్యక్తులు దేశం లోకి రాకుండా ఉండేందుకే ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు ట్రంప్ ప్రభుత్వం చెప్పుకుంటోంది. సో... అమెరికా వెళ్లాలనుకుంటున్న సోదర సోదరీమణుల్లారా... తస్మాత్ జాగ్రత్త... 

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: అమెరికా వెళ్లాలనుకుంటున్నారా... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top