Translate

  • Latest News

    12, మే 2018, శనివారం

    ఈ ప‌రిణామాలు ఎటు దారితీసెనో..... ?


    బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా కాన్వాయ్‌పై తిరుపతిలోఅలిపిరి వద్ద జ‌రిగిన దాడి నేప‌థ్యంలో టిడిపి , బీజేపీ ల మ‌ద్య వార్ మ‌రింత తీవ్ర‌మైంది. ఈ ప్ర‌భావం రానున్న‌రోజుల్లో చంద్ర‌బాబు పై ప‌డే ప్ర‌మాదం ఉంద‌ని భావిస్తున్నారు. టిడిపి కార్య‌క‌ర్త‌ల దాడితో ఏపీ ప్ర‌భుత్వ వైప‌ల్యం జాతీయ స్థాయిలో చ‌ర్చ‌కు దారి తీసింది. జెడ్ ప్ల‌స్ కేట‌గిరి ఉన్న బిజేపి జాతీయ అధ్య‌క్షుడు అమిత్‌షా, ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడి సంబంధాలు అంద‌రికి తెలిసింది. ఈ విష‌యాన్ని ప్ర‌ధాని , బిజేపి జాతీయ నాయ‌క‌త్వం అంత‌తెలిగ్గా తీసుకోర‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.
    చంద్ర‌బాబు మ‌ద్ద‌తు ఉందా ... ? 

    అమిత్‌షా దాడి నేప‌ధ్యంలో ప‌లు సందేహాలు త‌లెత్తున్నాయి. జెడ్‌ప్ల‌స్ కేట‌గిరి ఉన్న వారి విష‌య‌లో నిఘా వ‌ర్గాలు అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రిస్తాయి. ఇటువంటి వారి ప‌ర్య‌ట‌న‌కు ముందే అన్ని విష‌యాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటాయి. ప‌ర్య‌ట‌న వివ‌రాలు, ఆందోళ‌న జ‌రిగే వీలు ఉందా.. ఉంటే ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోవాలి... త‌దిత‌ర అంశాల ప్రాతిప‌దిక అంచెలంచెల  భ‌ద్ర‌త ను కొన‌సాగిస్తారు. కాని అమిత్‌షా ప‌ర్య‌ట‌న సంద‌ర్బంగా ఇవేమి క‌నిపించ‌లేదు. అమిత్ షా గోబ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ దూసుకువ‌చ్చిన టిడిపి కార్య‌క‌ర్త‌లు కాన్వాయ్‌ను అడ్డుకొని రాళ్లు రువ్వ‌డం జ‌రిగింది. ఇందుకు సంబంధించి కేంద్ర ఇంటెలిజెన్స్ వ‌ర్గాలు ఆరా తీసాయి. గ‌త నెల సీఎం పోలీస్ టెక్ భ‌వ‌నాన్ని ప్రారంబించే స‌మ యంలో తాను త‌లుచుకుంటే కేంద్ర‌వాహ‌నాలు తిర‌గ‌నివ్వ‌న‌ని తీవ్ర‌వ్యాఖ్య‌లు చేశారు. మంత్రులు , ఎమ్మెల్యేలు ఇందుకు వంత పాడారు. ఇటీవ‌ల బాలకృష్ణ చేసిన వ్యాఖ్య‌లు, బిజేపి నాయ‌కుల‌ను లక్ష్యంగా చేసుకొని టిడిపి నాయ‌కులు చేస్తున్న రెచ్చ‌గెట్టే వ్యాఖ్య‌లతోనే ఇటువంటి ప‌రిస్థితి వాటిల్లింద‌ని కేంద్ర నిఘా వ‌ర్గాలు గుర్తించాయి.
    ఈ ప్ర‌భావం ఎలా ఉండ‌బోతుంది... ? 
    అమిత్‌షా కాన్వాయ్‌పై జ‌రిగిన దాడి విష‌యంలో కేంద్రంలో బిజేపి ప్ర‌భుత్వం ఎలా స్పందించ‌నుంద‌న్న విష‌యంలో ఉత్కంత నెల‌కొని ఉంది. కొన్న రోజ‌లు నుంచి టిడిపి నాయ‌కులు చేస్తున్న విమ‌ర్శ‌లు , ఇందుకు ప్ర‌తిగా బిజెపి నాయ‌కులు చంద్ర‌బాబు పై చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌న్న సంకేతాలు అందించారు. మ‌రోవైపు టిడిపి ప్ర‌భుత్వం అనుస‌రించిన తీరుపై కూడా విమ‌ర్శ‌లు విన‌వ‌స్తున్నాయి. దైవ ద‌ర్శనానికి వ‌చ్చిన వారిపై ఇలా దాడులు చేయ‌టం మంచి సంప్ర‌దాయం కాద‌ని టిడిపిలోని సీనియ‌ర్లు బావిస్తున్నారు. ఈ దాడి నేప‌థ్యంలో చంద్ర‌బాబు అండ్‌కో పై కేంద్రం తీసుకోవాల‌ను కొన్న చ‌ర్య‌లు ఇంకాస్త ముందుకు జ‌రిగే అవ‌కాశం ఉంటుంద‌ని ఆందోళ‌న చెందుతున్నారు.

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: ఈ ప‌రిణామాలు ఎటు దారితీసెనో..... ? Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top