Translate

  • Latest News

    24, మే 2018, గురువారం

    కీర్తి లో పరకాయ ప్రవేశం చేసిన సావిత్రి


    మహానటి... నటశిరోమణి, కలైమామణి...ఇలా ఎన్ని బిరుదులిచ్చినా ఆమెకు తక్కువే... నటనలో ఆమె ఎవరెస్ట్ శిఖరం... వెండి తెరపై అందనంత ఎత్తుకు ఎదిగిన ఆమె జీవితం లో తెలిసో...తెలియకో చేసిన తప్పిదాల వలన..  నిష్కల్మషమైన ప్రేమ, అమాయకత్వమే ఆమెకు శాపాలై ఆమె జీవితాన్ని అధఃపాతాళానికి తొక్కేశాయి. 1981 లో మన మధ్య నుంచి భౌతికంగా నిష్క్రమించిన ఆమె ఇప్పటికి మనందరి మనస్సులో చెరగని ముద్రగా మిగిలిపోయింది. కానీ ఆమెతో పాటు పుట్టిన వారంతా కాల ధర్మాన్ని అనుసరించి భౌతికంగా అదృశ్యమైపోతున్నారు. ఆ తర్వాతి తరం ఆమె సినిమాలు చూసి పరవశించి ఆమెను ఆరాధించాయి. ఈ తరం బతికున్నంతవరకు ఆమెను గుర్తుపెట్టుకుంటారు. మరి... ఆ తర్వాతో.... సరిగ్గా ఈ ఆలోచనే స్వర్గలోకంలో ఉన్న సావిత్రి కి వచ్చి ఉంటుంది. అందుకే...  తరతరాలకు తన పేరు శాశ్వతంగా నిలిచిపోయేలా ఒక మాస్టర్ ప్లాన్ వేసింది.   అదేమిటో  తెలుసా... సావిత్రమ్మ... డైరెక్టర్ నాగ్ అశ్విన్ కు కలలో కనిపించి తనపై బయోపిక్ తీయమని ఆదేశించింది. అంతే దేవత ఆదేశించింది... భక్తుడు పాటించాడు... మరి సావిత్రిలా నటించాలంటే మాటలా... సావిత్రి పోలికలకు కాస్త దగ్గరగా ఉండే కీర్తి సురేష్ ను అయితే ఎలాగో వెతికి పట్టుకున్నాడు కానీ, ఆమె సావిత్రి లా నటించడమంటే మాటలా... కానీ నటించింది...అదెలా సాధ్యం... కానీ సాధ్యం అయింది... అదెలాగో తెలుసా.. ఆ రహస్యం ఏమిటో తెలుసా... నాకు తెలుసు... సావిత్రి కీర్తి లో పరకాయ ప్రవేశం చేసింది... తెరపై మనం చూస్తున్నది సావిత్రా ... కీర్తి సురేషా ... అని మన కళ్ళను మనమే నమ్మలేనంతగా మెస్మరైజ్ చేసింది. మరో వందేళ్లు....కాదు.. వెయ్యేళ్ళు... ఇంకా..ఇంకా.. తరతరాలకు...యుగయుగాలకు సావిత్రి కీర్తి శాశ్వతంగా, చిరస్థాయిగా మిగిలిపోతుంది. జోహార్ సావిత్రి...జోహార్... 
    (గమనిక : ఈ కధనం కేవలం సావిత్రి మీద అభిమానంతో రాసినది. స్వర్గం... పరకాయ ప్రవేశం లాంటివన్నీ నిజాలు కాకపోవచ్చు.. కానీ సరదాగా ఊహించి రాసినది. చదివి ఆనందిస్తారని ఆశిస్తూ...)
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: కీర్తి లో పరకాయ ప్రవేశం చేసిన సావిత్రి Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top