Translate

  • Latest News

    27, మే 2018, ఆదివారం

    సి.ఎం కుర్చీ... మీ దొడ్లో కట్టేసుకుంటారా..?


    2019 ఎన్నికల్లో రాష్ర్టానికి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావలసిన అవసరం ఉంది. 
    -సి.పీఐ కార్యదర్శి కె.రామకృష్ణ 
    ఒక్కసారి జగన్ కు సి.ఎం ఛాన్స్ ఇవ్వండి...మళ్ళి మళ్ళీ మీరే కోరుకుంటారు... 
    -సినీ నటుడు పోసాని కృష్ణ మురళి 
    40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు  అయితేనే ఈ రాష్ట్రాన్ని సమర్ధవంతంగా పాలించగలరు.
    -టి.డి.పీ నాయకులు 
    అసలు వీళ్లేవరండి మనల్ని పాలించడానికి...? మనల్ని మనమే పాలించుకుందాం... నాయకులు ప్రజాసేవకులుగా ఉండాలి కానీ... మన నెత్తిన ఎక్కి కూర్చోవడానికా... ఎన్నికలలో ఆయా పార్టీల సిద్ధాంతాలను బట్టి ప్రజలు బేరీజు వేసుకుని ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపిస్తారు... ఎక్కువ సీట్లు వచ్చిన పార్టీ నాయకుడిని ఆ పార్టీ తమ నాయకుడుగా ఎన్నుకుంటారు. వీళ్ళందరికీ ముఖ్యమంత్రి పదవి మీద అంత మోజు ఎందుకని... ఏ... వీళ్ళు పార్టీని గెలిపించి... పార్టీ  అధ్యక్షునిగా ఉంటూ... ఒక సమర్ధుడైన... ఏ మచ్చ లేని పరిపాలనదక్షుడిని... ఇప్పటిదాకా రాజకీయ పదవులకు దూరంగా ఉన్న సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రి ఎందుకు చేయకూడదు...?  ఏ... వీరంతా సోనియా గాంధీని తిడతారు కానీ... ఆమె పార్టీ రెండు సార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చి కూడా ఆమె ప్రధానమంత్రి పదవిని ఆశించకుండా... మన్మోహన్ సింగ్ ను కుర్చీలో కూర్చోబెట్టి...ఆమె వెనకాల ఉంది చక్రం తిప్పలేదా..? వీరెందుకు అలా చేయరు... గత తెలంగాణ ఎన్నికల్లో కె.సి.ఆర్ తమ పార్టీని గెలిపిస్తే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి... గెలిచాక ఆ మాటే మర్చిపోయారు. ఇప్పుడు ఆయన... ఆయన తదనంతరం.. ఆయన కుమారుడికి ఆ కుర్చీ దక్కేలా స్ట్రాంగ్ గా పునాది వేసి పడేశారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని ఇక్కడ చంద్రబాబు కూడా తన కొడుకును మంత్రిని చేసి...భావి ముఖ్యమంత్రిగా పునాది వేసేశారు. ఇలా వంశ పారంపర్య రాజకీయాలు చేస్తూ, తరతరాలకు రాజకీయాధికారాన్ని వాళ్ళ దొడ్లో కట్టేసుకుంటున్నారు.. ఇదేనా... ప్రజాస్వామ్యం..?  వంశ పారంపర్య రాజకీయాలకు స్వస్తి చెబుదాం... వాళ్ళ కుటుంబ ఆస్తులు పెంచుకోవడానికి కాకుండా నిజంగా ప్రజల కోసం  పనిచేసే నాయకులను ఎన్నుకుందాం.. 
    -ఇట్లు 
    సామాన్యుడు 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: సి.ఎం కుర్చీ... మీ దొడ్లో కట్టేసుకుంటారా..? Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top