Translate

  • Latest News

    28, మే 2018, సోమవారం

    మన జుట్టు సింగపూర్ చేతుల్లోనా...హవ్వ...


    మన జుట్టు సింగపూర్ చేతుల్లోనా...హవ్వ... హవ్వ... ఇదేమి ఘోరమండి బాబూ... ఇన్నాళ్లు...ప్రతిపక్షం ఏదో గోల చేస్తోంటే... వాళ్ళంతేలే ... అలాగే గోల చేస్తారు అని పట్టించుకోలా... కానీ...ఇప్పుడు సాక్షాత్తూ.... అమరావతి డెవలప్మెంట్ పార్టనర్స్ (ఏ.డి.పి ) లో డైరెక్టర్ గా ఉన్న ఒక ఐ.ఏ.ఎస్ ఆఫీసర్ నన్ను ఏ.డి.పి  లో నుంచి తప్పించండి... మహాప్రభో... అని వేడుకోవడం... చూస్తుంటే... అసలు అక్కడ ఏం  జరుగుతోండోనని తలచుకుంటే భయమేస్తోంది. సింగపూర్ ప్రైవేట్ కంపెనీలతో రాజధాని అమరావతి వ్యవహారాలంటేనే అధికారులు బెంబేలెత్తిపోతున్నారు. సింగపూర్ ప్రైవేట్ కంపెనీలు, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ కలసి అమరావతి డెవలప్ మెంట్ పార్టనర్స్ పేరుతొ రాష్ట్ర  ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఏ.డి.పీ చైర్మన్ గా సింగపూర్ కంపెనీలకు చెందిన వ్యక్తే ఉంటారు. మిగతా ఆరుగురు డైరెక్టర్ లలో ఇద్దరు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వారు ఉంటారు. మిగతా నలుగురు  సింగపూర్ కంపెనీలకు చెందిన ప్రతినిధులే ఉంటారట...ఇప్పటికే సింగపూర్ ప్రైవేట్ కంపెనీలకు రాజధానిలో స్టార్టుప్ ఏరియా అభివృద్ధి ప్రాజెక్ట్ అప్పగింత, స్విస్ ఛాలెంజ్ విధానం, రాయితీ, అభివృద్ధి., షేర్ హోల్డర్స్ ఒప్పందాల్లో లొసుగులు గురించి డైరెక్టర్ రవిచంద్ర తీవ్రంగా వ్యతిరేకించారు... ఇప్పుడు ఇక తాను  డైరెక్టర్ గా కొనసాగలేనని, తనను ఆ పదవి నుంచి తప్పించమని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారంటేనే అర్ధం చేసుకోవచ్చు పరిస్థితి ఎంత దారుణంగా ఉందోనని...  ఇదేమి ఘోరమండి ...బాబు. చైర్మన్ తో పాటు నలుగురు డైరెక్టర్ లు వాళ్ళ వారే ఉంటే... ఇక మన  మాట ఏమి నెగ్గుద్ది... మన జుట్టు తీసుకువెళ్లి వాళ్ళ చేతుల్లో పెట్టటమంటే ఇదే కదా... బాబూ ... చంద్రబాబు గారూ... మీరు మహా ఉంటే ఇంకో సంవత్సరం ముఖ్యమంత్రిగా ఉంటారు.. మీ కమిషన్ ల కోసం... రాష్ట్ర ప్రజలందరి భవిష్యత్తును తీసుకువెళ్లి సింగపూర్ వాళ్ళ చేతుల్లో పెడతారా... 
    మహానుభావుడు తరిమెల నాగిరెడ్డి గారు ఏనాడో చెప్పాడు.... తాకట్టులో భారత దేశం అని... అప్పుడు కాంగ్రెస్ పాలకుల సంగతేమో కానీ... ఆ పార్టీ నుంచే పుట్టుకొచ్చిన మీరు మాత్రం ఆంధ్ర రాష్ట్రాన్ని మొత్తం సింగపూర్ వాళ్లకు తాకట్టు పెట్టేస్తున్నారు.. మా భవిష్యత్తే కాదు.. మీరు చేసే అవినీతి పనుల వాళ్ళ ముందు తరాల వారి భవిష్యత్తు కూడా అంధకార బంధురం అయిపోతుంది... నాడు స్వాతంత్ర్య పోరాటంలో బ్రిటిష్ వారిని క్విట్  ఇండియా పిలుపు ఇచ్చినట్టు... రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే చంద్రబాబు ను క్విట్ ఆంధ్ర పిలుపు ఇవ్వాల్సిన పరిస్థితి తీసుకువస్తున్నారు. ప్రజల్ని డబ్బుతో కొనేయవచ్చనో... లేదా ప్రతిపక్షం మీద బురద జల్లి... వాళ్ళు తుప్పు... నేను నిప్పు అంటూ ప్రజల్ని మభ్యపెట్టో గెలిచేద్దాం అనుకుంటున్నారేమో... ప్రజలు ఒకసారి మోసపోతారు... రెండు సార్లు... మోసపోతారు...ఎల్లకాలం మోసపోరని గుర్తుంచుకోండి చంద్రబాబు గారు... 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: మన జుట్టు సింగపూర్ చేతుల్లోనా...హవ్వ... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top