Translate

  • Latest News

    28, జులై 2018, శనివారం

    1998 డీఎస్.సి అభ్యర్థులకు మొండి చేయి....


    పాపం...వారు చంద్రబాబు హయాంలో టీచరు పోస్ట్ కోసం పరీక్ష రాసిన పాపానికి  20 ఏళ్లుగా తమకు న్యాయంగా దక్కాల్సిన టీచర్ పోస్టుల కోసం అవిశ్రాంతంగా పోరాడుతూనే  ఉన్నారు. లాఠీ దెబ్బలు తిన్నారు... అరెస్ట్ అయ్యారు.. ఎన్నో రూపాల్లో ఆందోళనలు చేశారు. చివరకు  దక్కిందేమిటి...  1998 లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీరు  1998 డీఎస్.సి పరీక్ష రాశారు. ఆ సంవత్సరం ప్రభుత్వం మొత్తం 36,136 పోస్టుల భర్తికి నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే రాత పరీక్షలో  ఉన్న పోస్టుల్లో 50 శాతం మంది మాత్రమే అంటే కేవలం 18 వేల మంది మాత్రమే అర్హత సాధించారు. దీంతో ప్రభుత్వం అర్హత మార్కులను 5 చొప్పున అన్ని క్యాటగిరీల్లోనూ తగ్గించింది. అప్పుడు మరికొంతమంది అర్హత సాధించారు. ఈ సందర్భంగా టీచర్ పోస్టుల కేటాయింపులో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. ఇంటర్వ్యూ లో తమకు కావాల్సిన వారికి ఎక్కువ మార్కులు వేయించారని, దీనివల్ల రాత పరీక్షలో ఎక్కువ మార్కులు వచ్చిన వారికి అన్యాయం జరిగిందంటూ వారు ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు. రాత పరీక్షలో ఎక్కువ మార్కులు వచ్చిన వారికి అవకాశం ఇవ్వాలని ట్రిబ్యునల్ ఆదేశించింది. దీన్ని సవాల్ చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం హైకోర్టుకు వెళ్ళింది. హైకోర్టు అభ్యర్థులకు అనుకూలంగా తీర్పు ఇస్తే ప్రభుత్వం మళ్ళీ సుప్రీం కోర్టు కు వెళ్లింది. పైగా అర్హులైన అందరికి ఉద్యోగాలు ఇచ్చామని అబద్ధం ఆడేసింది. అందరికి ఉద్యోగాలివ్వాలని 2009 లో ట్రిబ్యునల్ తీర్పు ఇస్తే.. విద్యా శాఖ హైకోర్టు ను ఆశ్రయించింది. ఆ అభ్యర్థులందరికీ ఉద్యోగాలు ఇవ్వలసిందేనని, పాత తేదీల నుంచి నియమిస్తూ అప్పటి నుంచి వేతన బకాయిలు కూడా చెల్లించాలని 2011 లో మళ్ళి హైకోర్టు తీర్పు యిచ్చింది. 2014 అసెంబ్లీ ఎన్నికల ముందు వీరికి న్యాయం చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చాడు. కానీ అన్ని హామీల లాగానే దీనిని అటక ఎక్కించేశాడు. చివరికి ఇప్పుడు ఎన్నికల ముందు  దీనిపై ఎం.ఎల్.సి లతో ఒక కమిటీ వేశాడు.  ఆ కమిటీ మొత్తం 4535 మంది అర్హులు ఉంటే... వారిలో కేవలం 33 మందికే అదీ రెగ్యులర్ పోస్టులు కాకుండా... టైం స్కేల్ ఇస్తామని చెప్పింది. మిగతా వారందరికీ విద్యా వాలంటీర్లుగా అవకాశం కల్పిస్తే సరిపోతుందని సెలవిచ్చింది. ఇదండీ... 20 ఏళ్లుగా పోరాటం చేస్తున్న 1998 డి.ఎస్.సి అభ్యర్థులకు చివరకు దక్కిన న్యాయం... 


    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: 1998 డీఎస్.సి అభ్యర్థులకు మొండి చేయి.... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top