Translate

  • Latest News

    27, జులై 2018, శుక్రవారం

    సినిమాలు వదిలిపెట్టను... కమల్ హాసన్


    ఎం.జి.ఆర్ నాకు ఆదర్శం అంటున్నారు కమల్ హాసన్. ఇటీవలే రాజకీయ పార్టీ పెట్టి రాజకీయ అరంగేట్రం చేసిన కమల్ హాసన్ రాజకీయాల్లో ఎంత ఎత్తుకు ఎదిగినా.. సినిమాలు మాత్రం వదిలిపెట్టను అంటున్నారు. కమల్ పార్టీ పెట్టగానే ఇక కమల్ సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టినట్టే అని కమల్ హాసన్ అభిమానులంతా ఉసూరుమన్నారు. కానీ ఇప్పుడు కమల్ చేసిన ప్రకటన కమల్ అభిమానుల్లో సంతోషాన్ని నింపుతోంది. కమల్ నటించిన విశ్వరూపం-2 సినిమా కోసం గత మూడేళ్ళుగా ఆయన అభిమానులు కళ్ళు కాయలు కాచేటట్టు ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు విశ్వరూపం-2 సినిమా ఆగస్ట్ 15 న విడుదలవుతోంది. కూతురు శృతిహాసన్ తో కలసి నటిస్తున్న షబాష్ నాయుడు నిర్మాణంలో ఉంది. అది కాక శంకర్ దర్శకత్వంలో భారతీయుడు-2 షూటింగ్ ప్రారంభం కావలసి ఉంది. ఇప్పటిదాకా అభిమానులు భారతీయుడు-2 నే కమల్ ఆఖరి సినిమా అవుతుందేమోనని దిగులు పెట్టుకున్నారు... ఇక బెంగపడక్కరలేదు... కమల్ లాంటి మహానటుడు... తన చివరి శ్వాస వరకు నటిస్తూనే ఉంటారు. విచిత్రమేమిటంటే... తమిళ్ సినిమాలో  నటన విషయంలో కమల్ శివాజీగణేశన్ ను ఎక్కువగా అభిమానించేవారు. శివాజీ కూడా కమల్ ను తన పెద్ద కొడుకులా భావించేవారు. అయితే... రాజకీయాల విషయం వచ్చేసరికి కమల్ ఎం.జి.ఆర్ ను ఆదర్శంగా   తీసుకుంటున్నా అంటున్నారు... అదండీ.. సంగతి... 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: సినిమాలు వదిలిపెట్టను... కమల్ హాసన్ Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top