Translate

  • Latest News

    31, జులై 2018, మంగళవారం

    జ‌గ‌న్ వ్యూహాత్మ‌కంగానే వ్య‌వ‌హ‌రిస్తున్నారా...?


    వైసీసీ అధినేత వ్యూహాత్మ‌కంగానే అడుగులు వేస్తున్నారా...? అన్న ప్ర‌శ్న‌కు అవున‌నే స‌మాధానం వ‌స్తుంది. మీడియా ఇటీవ‌ల జ‌గ‌న్‌ను ప్ర‌శ్నించిన‌ప్ప‌డు ఆవేశంగా మాట్లాడిన‌ట్లు మాట్లాడి ప‌వ‌న్ పై వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేశారు.కా పుల రిజర్వేషన్ ల గురించి జగ్గంపేటలో బ‌హిరంగ స‌భ‌లో కాపు రిజ‌ర్వేష‌న్‌పై  ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శించిన సంద‌ర్బంగా మాట్లాడిన మాట‌లు ఒక అయోమ‌యాన్ని సృష్టించాయి. ఇంకేముంది చంద్ర‌బాబు, ఆయ‌న మీడియా ఇదే అవ‌కాశం అనుకుంటూ విరుచుకుప‌డింది. ఇదంతా కొన‌సాగుతుండ‌గానే ప‌వ‌న్‌ను విమ‌ర్శించిన టీడీపీ నేత‌లుఆయ‌న‌ను అక్కున చేర్చుకొని జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌పై ఖండించారు. ఉద్య‌మం చేస్తామంటూ హెచ్చ‌రించారు. మ‌రోవైపు కాపు రిజ‌ర్వేష‌న్‌పై వ్యాఖ్య‌ల‌పై స్వ‌యాన చంద్ర‌బాబు జ‌గ‌న్‌పై దుమ్మెత్తిపోయాల‌ని, కేంద్రం ప‌రిదిలో 9 నెల‌లుగా పెండింగ్‌లో ఉన్న 9షెడ్యుల్‌లో చేర్చాల‌ని పిలుపు నిచ్చారు.మ‌రో వైపు ముద్ర‌గ‌డ జ‌గ‌న్‌పై ఆరోప‌ణ‌లు చేశారు.ఈ క్ర‌మంలోనే బీసీ నాయ‌కులు , బీసీ సంక్షేమ సంఘం నాయ‌కులు, టీడీపీ ఎమ్మేల్యే కృష్ణ‌య్య జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌ను స్వాగ‌తించారు.  ఇదంతా ఈ వారం రోజులోపు జరుగుతున్న ప‌రిణామాలు. 

    అయితే జ‌గ‌న్ బిగించిన ఉచ్చులో టీడీపీ నాయ‌కులు ప‌డిన‌ట్లు తెలుస్తోంది. ప‌వ‌న్‌పై వ్యాఖ్య‌లు చేయ‌గానే టీడీపీ అనుకూల కాపు సంఘ నేత‌లు ఆగ్ర‌హాం వ్య‌క్తం చేయ‌గా, మంత్రులు, టీడీపీ నేత‌లు ప‌వ‌న్‌ను వెనుకేసుకొచ్చారు. గ‌త కొంత‌కాలంగా ప‌వ‌న్‌, చంద్ర‌బాబు మ‌ద్య జ‌రుగుతున్న చీక‌టి చ‌ర్చ‌ల‌ను జ‌గ‌న్ వ్యాఖ్య‌లు బ‌య‌ట‌పెట్టిన‌ట్లైంది. మ‌రోవైపు కాపుల ఉద్య‌మ నాయ‌కుడి ముద్ర‌గ‌డ కుటుంబంపై చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రించిన తీరు, అరెస్టులు ఇంకా మ‌ర‌వ‌క ముందే ఆయ‌న చంద్ర‌బాబును పొగుడ్తూ చేసిన వ్యాఖ్య‌లు, రిజ‌ర్వేష‌న్ల అంశం కేంద్రం ప‌రిధిలోనిది అంటూ రాష్ట్ర ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తు ప‌లికిన‌ట్లు మాట్లాడ‌టం కూడా ఆయ‌న ప్ర‌యాణం ఎటువైపో స్ప‌ష్టం చేసిన‌ట్లైంది. మ‌రోవైపు రిజ‌ర్వేషన్ల‌పై జ‌గ‌న్ వ్యాఖ్య‌లు బీసీలు మ‌ద్ద‌తు ప‌ల‌క‌టం విశేషం. 
    ఈ ప‌రిణామాలు ఇలా కొన‌సాగుతుండ‌గానే ఫిఠాపురం లో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున సభ నిర్వహించడం విశేషం.జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర పిఠాపురం చేరుకుంది..జగ్గంపేటలో కాపుల రిజర్వేషన్ లపై చేసిన జగన్ ప్రకటన చేసిన తర్వాత జరిగిన ఈ సభ ఎలా జరుగుతుందన్న ఉత్కంఠ ఏర్పడగా, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి సభను సక్సెస్ చేయడం విశేషం.ఈ స‌భ‌లోనే కాపుల రిజ‌ర్వేష‌న్ల అంశంపై మ‌రింత‌గా స్ప‌ష్టంగా మాట్లాడి అక‌ట్టుకోవ‌టం విశేషం.ఈ సంద‌ర్బంగా ఆయ‌న‌. ఏబై శాతం దాటకూడదని రిజర్వేషన్ లపై సుప్రింకోర్టు చెప్పింది.దీనిపై దశాబ్దాల తరబడి పరిష్కారం రావడం లేదు..అలాంటి జటిలమైన సమస్యపై చంద్రబాబు నేను చేసేస్తానని చెప్పడం మోసం కాదా అని విపక్ష నేత జగన్ ప్రశ్నించారు. ఆరు నెలల్లో రిజర్వేషన్ లు ఇస్తానని చెప్పిన చంద్రబాబు మోసగాడా? కాపుల ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రయత్నిస్తుంటే కాపులకు అండగా ఉన్న తాను మోసగాడినా అని జగన్ ప్రశ్నించారు.
    మొత్తంమీద జ‌గ‌న్ వేసిన ఉచ్చులో టీడీపీ నాయ‌కులు చిక్కుకొన్న‌ట్లే అని తెలిసిపోతుంది. తిరిగి కాపు రిజ‌ర్వేష‌న్ల ఉద్య‌మం మొద‌ల‌య్యే అవ‌కాశం ఉంది. 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: జ‌గ‌న్ వ్యూహాత్మ‌కంగానే వ్య‌వ‌హ‌రిస్తున్నారా...? Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top