Translate

  • Latest News

    25, ఆగస్టు 2018, శనివారం

    డి.ఎస్సీ-2018 ఇక లేనట్టేనా..?



    డి.ఎస్సీ-2018 ఇక లేనట్టేనా..? ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన వందలాది హామీలలో డి.ఎస్సీ ఒకటి. తాను అధికారంలోకి వస్తే ఏడాది కొకసారి ఫిక్స్డ్ టైం టేబుల్ పెట్టి డి.ఎస్సీ నిర్వహిస్తానని డంబాలు  పలికారు. అధికారంలోకి రాగానే 2014 లో డి.ఎస్సీ-2014 వేసారు. ఆహా... బాబు గారు అన్న మాట నిలబెట్టుకున్నారు... ఇక ప్రతి ఏడాది డీ.ఎస్సీ వేస్తారని నిరుద్యోగులు సంబరపడ్డారు. వేలాది రూపాయలు ఖర్చు పెట్టి...  కొంత మంది అయితే చేస్తున్న ఉద్యోగాలకు సెలవు పెట్టి, అదీ  కుదరని వారు ఉన్న ఉద్యోగాన్ని మానేసి మరీ కోచింగ్ సెంటర్లలో చేరారు. మధ్యలో నిరుద్యోగుల ఆశలు చల్లారిపోకుండా రెండు సార్లు టెట్ పరీక్ష నిర్వహించింది. దీంతో నిరుద్యోగులు మరింత బలంగా ఆశ పెట్టుకున్నారు. ప్రభుత్వం పుణ్యమా అని కోచింగ్ సెంటర్ల వాళ్ళు బాగుపడ్డారు కానీ.. నిరుద్యోగుల ఆశలు మాత్రం అడియాసలు గానే మిగిలిపోయాయి.  తీరా... అదేదో సామెత చెప్పినట్టు... మబ్బును నమ్ముకుని ముంతలో నీళ్లు పారబోసుకున్నట్టయింది పాపం... నిరుద్యోగ ఉపాధ్యాయుల పరిస్థితి.
    ముంచుకొస్తున్న ఎన్నికల సీజన్లో అసెంబ్లీ ఎన్నికల లోపు ఇక   డి.ఎస్సీ  లేనట్టేనా..? అనే అనుమానం కూడా కలుగుతోంది. ప్రభుత్వం మాత్రం మూడేళ్లుగా... ఇదిగో...అదిగో అని ఊరిస్తూ... ఊరిస్తూ... నిరుద్యోగులను నయవంచన చేస్త్తూ వచ్చింది.   ఆర్ధిక అనుమతులు వస్తే... ఆర్ధిక శాఖ జి.ఓ ఇస్తే మూడు...నాలుగు రోజుల్లోనే నోటిఫికేషన్ ఇస్తామని పాఠశాల విద్య కమిషనర్ కె. సంధ్యారాణి చెబుతున్నారు. కానీ ఆర్ధిక శాఖ జి.ఓ ఇవ్వాలంటే బాబు గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి కదా... ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు గారు పన్ను పీకించుకోవటానికి సింగపూర్ వెళ్లి చికిత్స చేయించుకుంటే ఆయన గారికి రూ. 2,88,823 మంజూరు చేస్తూ ఆగమేఘాల మీద వెంటనే జి.ఓ జారీ చేస్తారు కానీ... లక్షలాది మంది నిరుద్యోగ ఉపాధ్యాయుల గోడు ప్రభుత్వానికి ఎందుకు పడుతుంది...ఇంతేలే నిరుద్యోగుల బతుకులు... ఇవి.. ఎంతకూ బాగుపడని అతుకుల బొంతలు... 

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: డి.ఎస్సీ-2018 ఇక లేనట్టేనా..? Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top