Translate

  • Latest News

    27, ఆగస్టు 2018, సోమవారం

    గుంటూరు జిల్లాల్లో టి.డి.పీ అవినీతి సీరియల్


    గుంటూరు జిల్లాల్లో టి.డి.పీ అవినీతి సీరియల్ రసవత్తరంగా సాగుతోంది. మొన్న గురజాల ఎం.ఎల్.ఏ వందల కోట్ల మైనింగ్ కుంభకోణం ఓ రెండు వారాల పాటు  ఆసక్తిదాయకంగా సాగింది. ఆ తరువాత  తెనాలి ఎం.ఎల్.ఏ ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఎన్.ఆర్.ఐ విద్యా సంస్థల తరపున వందల కోట్ల పన్ను ఎగవేత కథనం సంభ్రమాశ్శర్యాలను కలిగించింది. నేడు సత్తెనపల్లి ఎం.ఎల్.ఏ, శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు నరసరావు పేటలో క్రీడా స్టేడియం అభివృద్ధి పేరుతొ జిల్లా లోని ప్రైవేటు విద్యా సంస్థల నుంచి నెల నెలా వసూళ్ల కార్యక్రమం చేయడం, పైగా దీనికి ఏకంగా కలెక్టర్ ఆదేశాలు పాస్ చేయడం మరింత అబ్బురపరుస్తోంది. మొత్తం మీద ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ అవినీతి బాగోతాల సీరియళ్లు అఖిలాంధ్ర తెలుగు ప్రజానీకానికి కనుల పండుగ చేస్తున్నాయి. గురజాల ఎం.ఎల్.ఏ యరపతినేని శ్రీనివాస రావు  గత నాలుగేళ్లుగా ఇష్టారాజ్యంగా సున్నపు రాయి గనులు తవ్వేసుకోవడం, ఆయన వెనుక చినబాబు లోకేష్ ఉన్నాడని భయపడి అధికారులు జీ హుజూర్ అనడం. తీరా ఓ వ్యక్తి పిటిషన్ తో హైకోర్టు మొట్టికాయలు వేస్తే కానీ ఈ వందల కోట్ల కుంభకోణం వెలుగులోకి రాకపోవడం జరిగింది. అయినా హైకోర్టు చెప్పిన తర్వాత కూడా సి.బి.ఐ విచారణ కాకుండా రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉండే సి.బి.సి.ఐ.డి తో తూతూ మంత్రం గా విచారణ కధ నడిపిస్తూ సీరియల్ ను ఆసక్తికరంగా కొనసాగిస్తున్నారు. ఆ తర్వాత గత వారం అవినీతి లోనూ ఘనాపాటి అనిపించుకున్న ఆలపాటి ఆయన సొంత విద్యా సంస్థలు అయిన ఎన్ ఆర్.ఐ విద్యా సంస్థల్లో విద్యార్థులనుంచి వేల  కోట్ల రూపాయల ఫీజులు వసూలు చేస్తూ ప్రభుత్వానికి పన్ను కట్టకుండా ఎగవేస్తున్న బాగోతం వెలుగులోకి వచ్చింది. ఎన్.ఆర్.ఐ కు గుంటూరు కేంద్రంగా  ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మొత్తం  43 జూనియర్ కాలేజీలు ఉన్నాయి. ఆలపాటి ఎన్.ఆర్.ఐ అకాడమీ మేనేజింగ్ పార్ట్నర్ గా  వ్యవహరిస్తున్నారు. 2011 లో సర్వీస్ టాక్స్ రిజిస్ట్రేషన్లకి దరఖాస్తు చేశారు. సర్వీస్ టాక్స్ చెల్లించి రిటర్న్స్ ఫైల్ చేయమని విజయవాడ సర్వీస్ టాక్స్ సూపరింటెండెంట్ సూచించగా 2012లో నిల్ రిటర్న్స్ ఫైల్ చేసారు.  ఈ మధ్యలో సర్వీస్ టాక్స్ నుంచి మినహాయింపు కోరుతూ దరఖాస్తు చేసారు. అప్పటినుంచి ఎన్ ఆర్.ఐ ప్రభుత్వానికి ఎటువంటి పన్ను చెల్లించలేదు. దీంతో 2015 ఏప్రిల్ 17 న 60. 9 కోట్లు పన్ను కట్టాలని ఎన్ .ఆర్.ఐ కు షోకాజ్ నోటీసు జారీ అయింది. అయినప్పటికీ కట్టకపోవడంతో ఇప్పుడది అపరాధ రుసుము తో కలసి ప్రభుత్వానికి వంద కోట్లకు పైగానే కట్టవలసి ఉంది. ఇక తాజాగా గౌరవనీయులైన స్పీకర్ గారి వంతు వచ్చింది. ఆయన ఒత్తిడితో అప్పటి గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే నరసరావు పేట స్టేడియం అభివృద్ధి కోసం జిల్లాలోని ప్రైవేట్ విద్యా సంస్థలన్నీ నెలకు ఇంత  చొప్పున సంవత్సరానికి 30 వేల నుంచి 90 వేల వరకు చెల్లించాలని ఆదేశాలు జారీ చేయడం సంభ్రమాశ్శర్యాలను కలిగించింది. పైగా ఇలా వసూలు చేసిన సొమ్మంతా కోడెల గారి తనయుడు జేబులోకి వెళుతుందని సాక్షి పత్రిక కధనం.  ఈ విధంగా తెలుగుదేశం ఎం.ఎల్.ఏ ల అవినీతి సీరియల్ మహా రంజుగా సాగుతోంది. ఇక మున్ముందు ఈ సీరియల్ లో ఇంకా ఎవరెవరి బాగోతాలు బయట పడతాయో చూడాలి మరి... 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: గుంటూరు జిల్లాల్లో టి.డి.పీ అవినీతి సీరియల్ Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top