
ప్రముఖ సినీ నటుడు, జానపద చిత్రాల రారాజు కాంతారావు జీవిత చరిత్రపై త్వరలో బయోపిక్ రానుంది. మహానటి సావిత్రి జీవితంలో ఎన్ని మలుపులు ఉన్నాయో కాంతా రావు జీవితంలో కూడా అన్ని ఎత్తుపల్లాలు ఉన్నాయి. ఎన్.టి.ఆర్ , కాంతారావు ఇద్దరూ ఒకే సంవత్సరం(1923) లో పుట్టారు. వయసులో సమానమే కాదు...జానపద సినిమాల్లోనూ ఆయనకు సరిసమానంగా ఎదిగారు. వారిద్దరి కాంబినేషన్ లో చిక్కడు. దొరకడు , కదలడు ..వదలడు వంటి ఎన్నో సినిమాలు మనల్ని అలరించాయి. సినీ పరిశ్రమలో కత్తి కాంతారావు గా పేరొంది... ఒక దశలో ఎన్.టి.ఆర్ తో సమానంగా జానపద చిత్రాల హీరోగా వెలుగొందిన కాంతారావు తన జీవిత చరమాంకంలో ఆర్ధికంగా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. చివరకు తినడానికి తిండి కూడా లేని కడు పేదరికంలో కాన్సర్ వ్యాధితో 2009 మార్చి 22 వ తేదీ రాత్రి హైదరాబాద్ యశోద ఆస్పత్రిలో మరణించారు. ప్రస్తుతం చంద్ర ఆదిత్య అనే సీనియర్ దర్శకుడు ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నట్టు కృష్ణా నగర్ నుంచి అందిన తాజా వేడి వేడి పకోడీ లాంటి వార్త. ఈ సినిమాలో కాంతారావు పాత్రను సన్నీ అఖిల్ అనే ఒక నూతన నటుడు నటించనున్నారు. ఈ కుర్రాడి తండ్రి కూడా సినీ దర్శకుడే కావడం విశేషం. అందరూ డూప్ హీరోలను నటులుగా పెట్టి ఎన్.టి.ఆర్ నగర్ అనే హిట్ సినిమా తీసిన దర్శకుడు బాబ్జి కుమారుడే సన్నీ అఖిల్. సన్నీతో కత్తి పట్టించి కాంతారావు పాత్రకు ఎలా ఉంటాడో మేకప్ టెస్ట్ కూడా చేసినాకే సన్నీ ని ఆ పాత్రకు ఓ.కే చేసారు. ఇకపోతే వృద్ధాప్యంలో కాంతారావు పాత్రను నరసింహరాజు చేయనున్నారు. మిగతా వివరాలు త్వరలో...
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి