Translate

  • Latest News

    29, ఆగస్టు 2018, బుధవారం

    చైతన్య రథసారథి హరికృష్ణ


    విధి విచిత్రం ఆంటే ఇదేనేమో... 9 నెలల పాటు నిరాటంకంగా వేల కిలోమీటర్లు చైతన్య రధాన్ని నడిపిన నందమూరి హరికృష్ణ కారు ప్రమాదంలో మరణించడం.. విధి వైపరీత్యం కాక మరేమిటి... 1982 లో తండ్రి నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించి, 9 నెలల పాటు చైతన్య రథంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా చుట్టిన సంగతి అందరకు తెలిసిందే... అందరూ గొప్పగా ఎన్.టీ.ఆర్ నే చెప్పుకుంటారు... కానీ తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీల గురించి ఎవరూ మాట్లాడని విధంగానే... ఎన్.టీ.ఆర్ తో పాటు 9 నెలలు తోడుగా ఉండి, ఎన్.టీ.ఆర్ కుమారుడు అయి ఉండి కూడా ఒక సామాన్యమైన వ్యక్తిలా తన తండ్రి ప్రయాణిస్తున్న చైతన్య రథానికి డ్రైవర్ గా వున్న హరికృష్ణ గురించి ఎవరూ చెప్పుకోరు. 1982 లో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఆ రోజుల్లో పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి హరికృష్ణ తండ్రికి చేసిన సేవ ఏమిటో తెలుసు. అప్పటి నాయకులు ప్రతి ఒక్కరితోనూ ఆయనకు ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి. ముక్కు సూటీగా మాట్లాడే హరికృష్ణ స్నేహానికి ప్రాణమిచ్చే వ్యక్తి. అందుకే ఆయనకు పార్టీ రహితంగా అన్ని పార్టీల్లోనూ ఆయన్ను అభిమానించే వారున్నారు. స్నేహం కోసమే నెల్లూరు జిల్లా కావలి లో స్నేహితుడు మోహన్ కుమారుడి  వివాహానికి హాజరు కావడానికి హైదరాబాద్ లో తెల్లవారుజామున నాలుగు గంటలకు స్వయంగా కారు నడుపుకుంటూ బయలుదేరి సుమారు 6 గంటల సమయంలో నల్గొండ జిల్లా అన్నెపర్తి వద్ద  రోడ్డు ప్రమాదంలో మరణించారు. తనకు ఎంతో ఇష్టమైన డ్రైవింగ్ లోనే ఆయన మరణించడం దురదృష్టకరం. ఎన్.టీ.ఆర్ కుటుంబంలో పెద్దగా...కుటుంబంలో ఎవరు...ఏ పార్టీలో ఉన్నా...అందరికి సంధానకర్తగా వ్యవహరించే  హరికృష్ణ లేని లోటు ఆ కుటుంబానికి తీరని లోటు. 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: చైతన్య రథసారథి హరికృష్ణ Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top