Translate

  • Latest News

    30, ఆగస్టు 2018, గురువారం

    చాప కింద నీరులా దూసుకొస్తున్న జనసేన


    ఆంధ్రప్రదేశ్ లో జనసేన చాప కింద నీరులా సైలేంట్ గా వర్క్ చేస్తూ గప్ చిప్ గా దూసుకొస్తోంది. జగన్ రాయల సీమ నుంచి మొదలెట్టి శ్రీకాకుళంకు పాదయాత్ర చేస్తుండగా... పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం నుంచి మొదలెట్టాడు.  మధ్య మధ్య అంతరాయాలు ఇస్తూ విడతలు విడతలుగా తన పర్యటన కొనసాగిస్తున్నాడు. వామపక్షాలు, ఇతర భావసారూప్యత  కలిగిన పార్టీలతో కలసి కామ్ గా తన పని తాను  చేసుకుపోతున్నాడు. ఇటీవల భీమవరం సభలో జనసేన అధికారంలోకి వస్తే ఏమేమి చేస్తుందో ప్రజలకు వరాలు ప్రకటించాడు. ఇపుడు ఆ వరాలను జనం లోకి తీసుకువెళ్ళడానికి పార్టీ క్యాడర్ కి ఒక కార్యక్రమం రూపొందించాడు. వాటిలో ముఖ్యంగా  మహిళలకు ఉచితంగా వంట గ్యాస్ పధకాన్ని బాగా ప్రజల్లోకి తీసుకువెళ్లనున్నారు. అలాగే రేషన్ సరుకులకు బదులు నెలనెలా వారి అకౌంట్లలో 2,500 లేదా 3000 రూపాయలు జమ చేసే పధకం కూడా ప్రజలకు ఆకర్షణీయంగా ఉంది. తన పధకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే క్రమంలో భాగంగా మొదటి మెట్టుగా సెప్టెంబర్ 2 వ తేదీ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు ను ఎంచుకున్నారు. ఆ రోజు రాష్ట్రంలోని ప్రతి జిల్లా లోనూ వెయ్యి కేంద్రాల్లో జనసేన జెండా ఎగురవేయడం ద్వారా జనసేనను ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి పార్టీ పొలిట్ బ్యూరో ప్లాన్ చేసింది. అందుకు అనుగుణంగా పార్టీ నాయకులు తమ కార్యకలాపాలను ప్రారంభించారు. ఇప్పటిదాకా జనసేనను ప్రధాన పార్టీలైన తెలుగుదేశం, వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ లు తేలికగా అంచనా వేస్తున్నాయి. కానీ... అంత తేలికగా తీసివేయదగ్గ పార్టీ కాదని, దాని ప్రభావం గణనీయంగానే ఉంటుందని గ్రహించే రోజు త్వరలోనే  వస్తుందని గుంటూరు జిల్లాకు చెందిన జనసేన పార్టీ కీలక నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు.
    సెప్టెంబర్ 2 మూడు పార్టీలకు ముఖ్యమే...
    సెప్టెంబర్ 2 వై.ఎస్.రాజశేఖర రెడ్డి వర్ధంతి కావడంతో అదే రోజు ఆ పార్టీ వాళ్ళ కార్యక్రమాలు కూడా రాష్ర్టం అంతటా విస్తృతంగా జరుగుతాయి. వై.ఎస్.ఆర్ అభిమానులు ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తారు. ఇక అదే రోజు నందమూరి హరికృష్ణ పుట్టిన రోజు కావడం... ఆయన చనిపోయిన తర్వాత నాలుగు రోజులకే వచ్చిన తొలి జయంతి కావడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా అక్కడక్కడా హరికృష్ణ జయంతులు జరిపే అవకాశం ఉంది. దీంతో ఆ రోజు రాష్ర్ట్రంలో మూడు పార్టీల జెండాలు రెపరెపలాడే అవకాశాలు ఉన్నాయి. 

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: చాప కింద నీరులా దూసుకొస్తున్న జనసేన Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top