Translate

  • Latest News

    1, సెప్టెంబర్ 2018, శనివారం

    వచ్చింది బెత్తెడు...పోయింది బారెడు...


     గుంటూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తరపున దాదాపు రూ.30 కోట్లు ఖర్చు పెట్టి అట్టహాసంగా నిర్వహించిన నారా హమారా... టీడీపీ హమారా కార్యక్రమం ద్వారా ఆయనకు లభించిన లబ్ది బెత్తెడు అయితే... ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపిన 8 మంది ముస్లిం యువకులను అరెస్ట్ చేసి, కుట్ర కేసులు పెట్టడం ద్వారా ఆయన కోల్పోయింది మాత్రం బారెడు. ఈ కార్యక్రమం కోసం 13 జిల్లాల నుంచి భారీ ఎత్తున ఆర్.టి.సి బస్సులను పెట్టి వేలాదిమందిని తరలించి చివరకు సాధించిందేంటి.. అప్రతిష్ట... దీనికోసం 30 కోట్ల ప్రజల సొమ్ము బూడిదలో పోసిన పన్నీరు... అడిగేవాడు లేదు కదాని.... ఒక వేళ ప్రతిపక్షాలు అడిగినా వాళ్లపై తన అనుకూల మీడియాతో ఎదురు బురద చల్లించి ...ప్రజలను బురిడీ కొట్టిస్త్తూ పబ్బం గడుపుకోవడం నారా వారికి బాగా తెలిసిన విద్య. కలిసొచ్చే కాలంలో నడిచొచ్చే కొడుకు పుడతాడనేది సామెత.... చంద్రబాబుకు గతంలో ఈ సామెత లా అంతా కలిసొచ్చింది. పట్టిందల్లా బంగారం అయింది. 
    ఇప్పుడు నడుస్తున్నదంతా వేరే సామెత...  అదేమిటంటే... తాడే...పామై కరిచినట్టు... ప్రస్తుత సీజన్ లో చంద్రబాబు ఏది తలపెట్టినా ఈ సామెతే వర్తిస్తోంది. 2014 లో ముఖ్యమంత్రి అయ్యాక వెంటనే ప్రపంచ స్థాయి రాజధాని కోసం అని మూడు పంటలు పండే బంగారం లాంటి భూముల్ని రైతుల వద్ద నుంచి బెదిరించి, భయపెట్టి.. 30 వేల  ఎకరాలు లాక్కున్నా... దాని వలన మూటగట్టుకున్న అప్రతిష్ట అంతా...ఇంతా కాదు...  2015 లో వచ్చిన గోదావరి పుష్కరాలలో సినిమా డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్తో షూటింగ్ చేయించి... దానిని కుంభమేళా తరహాలో గొప్పగా చూపించి  ప్రపంచ పర్యాటకులను ఆకర్షించాలని బాబు గారు మాస్టర్ ప్లాన్ వేస్తే .. అది కాస్తా బెడిసికొట్టింది. తొక్కిసలాటలో 29 మంది ప్రాణాలు గోదాట్లో కలసిపోయాయి. కేంద్రంలో మోదీ నా మనిషి...నేను ఎంత చెబితే అంత అనుకుంటే... తీరా ఆయన బాబును డోంట్ కేర్ అన్నట్టు చూసేసరికి చివరకు ఆయనతో మైత్రి కి కటీఫ్ చెప్పాల్సి వచ్చింది.  మొన్న ముస్లింల సభలో కూడా ఇదే  రిపీట్ అయింది. సభ పెట్టి.. ముస్లింలను అక్కున చేర్చుకుందామని ఆశిస్తే...  పోలీసుల అత్యుత్సాహంతో వాళ్ళు మరింత దూరమయేలా తదనంతర పరిణామాలు సంభవించాయి.  సో.. బాబు గారు... మీ టైం బాగోలేదు... జాగ్రత్త.. 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: వచ్చింది బెత్తెడు...పోయింది బారెడు... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top