Translate

  • Latest News

    14, ఆగస్టు 2018, మంగళవారం

    గుమ్మడి కాయల దొంగలు భుజాలు తడుముకున్నట్టు...


    వై.ఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కడప జిల్లా ఓబుళాపురం మైనింగ్ గనుల్లో అవినీతి గురించి ప్రతిపక్షాలు అసెంబ్లీలో గొడవ చేస్తే...అప్పటి టి.డి.పీ నేత నాగం జనార్ధన రెడ్డితో అఖిలపక్ష కమిటీని వేశారు... అదీ... ప్రజాస్వామ్య లక్షణం అంటే... మరి ఇప్పుడేమో... దాచేపల్లి మైనింగ్ అక్రమాలపై ఎన్ని ఆరోపణలు వచ్చినా ఇప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కనీసం విచారణకు ఆదేశించరు . చివరకు హైకోర్టు మొట్టికాయలు వేస్తే అధికారులను పంపించి తూతూ మంత్రంగా సర్వేలు చేయించి, అసలు నిందితుల మీద ఈగ వాలకుండా... కూటికి గతి లేని కార్మికుల మీద కేసులు పెట్టి.. వారే వందల కోట్లు మింగేశారంటు మన చెవుల్లో కాలిఫ్లవర్లు పెడతారు... అసలు నిజాల్ని వెల్లడి చేయడానికి బయలుదేరిన వై.ఎస్.ఆర్.సీపీ నాయకులను ఆ దరిదాపుల్లోకి వెళ్లనీయకుండా...ఎక్కడికక్కడ అరెస్టులు చేసి, సాయంత్రం దాకా పోలీస్ స్టేషన్లలోనూ, వారి వారి ఇళ్లలోనూ నిర్బంధించి నిజాల గొంతు నొక్కేస్తారు. మీ హడావిడి చూస్తేనే ప్రజలకు అర్ధమైపోతోంది గుమ్మడి కాయల దొంగలు భుజాలు తడుముకుంటున్నారని... ప్రతిపక్షం ఆరోపిస్తున్నట్టుగా దాచేపల్లి మైనింగ్ లో తవ్వుకున్న వందల కోట్ల సంపాదనలో లోకేష్ కు వాటాలు వెళతాయనే మాట అక్షరాలా నిజమేనేమో అన్నట్టుగా మీ చర్యలు తేటతెల్లం చేస్తున్నాయి.  వై.ఎస్. రాజశేఖర రెడ్డి లాగ దమ్ముగా విచారణకు ఆదేశిస్తే మిమ్మల్ని ఒక్క మాట అనే దమ్ము ఎవరికి ఉండేది కాదుగా.. మీరు ఆ పని చేయరు. మీకు ఏ సమస్యనైనా ఎదురొడ్డి రొమ్ము  చూపి ఎదుర్కోవడం అలవాటు లేదు కదా... వెన్ను చూపి... వెన్నుపోట్లు పొడవడమే మీ అలవాటు కదా... సారీ.. పుట్టుకతో వచ్చిన నైజం...పుడకతో కానీ పోదంటారు... మీ తీరే అంత... అందుకే జగన్ కు వస్తున్న  ప్రజాదరణ చూసి తట్టుకోలేక ఆయన మీద తప్పుడు కేసులు పెట్టిన ఏడేళ్ల తర్వాత ఇప్పుడు ఆయన భార్యను కొత్తగా కేసుల్లో ఇరికించి,, ఆయన్ను మానసికంగా దెబ్బ తీయాలని చూస్తున్నారు. కానీ ఆ గుండె.. అంత బలహీనమైన గుండె కాదు... మీరు గత తొమ్మిదేళ్లుగా కొడుతున్న సమ్మెట పోట్లు  తినీ  తినీ  రాటుదేలి ఉక్కులా తయారైనది.  ఆ ఉక్కు గుండె ముందు మీరెన్ని కుట్రలు చేసినా తుక్కు కావలసిందే... 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: గుమ్మడి కాయల దొంగలు భుజాలు తడుముకున్నట్టు... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top