Translate

  • Latest News

    15, ఆగస్టు 2018, బుధవారం

    చంద్రబాబును వరల్డ్ బ్యాంకు అధ్యక్షుడిగా చేయాలి


    ఎవడురా అమరావతిపై కారుకూతలు కూసేది..? అమరావతి ఒట్టి భ్రమరావతి అన్నది... ఇకనైనా మీ తప్పుడు ఆరోపణలు మానండి. కావాలంటే చూడండి.. నిన్న (ఆగస్టు 14) ముంబయి స్టాక్ ఎక్స్చేంజి లో అమరావతి బాండ్లు పెట్టిన రెండు, మూడు గంటల్లోనే ఒక్కో బాండు 10 లక్షల కనీస విలువతో 1300 కోట్లకు రిలీజ్ చేస్తే 2000 కోట్లకు అమ్ముడుపోయాయి తెలుసా... దటీజ్ చంద్రబాబు... ఆ పేరే ఒక బ్రాండ్ నేమ్.  ఆ బ్రాండ్ కు ఉన్న విలువ అలాంటిది. ఆ డిమాండ్ చూసి స్టాక్ ఎక్స్చేంజి పెద్దలే నోరెళ్లబెట్టారు తెలుసా... చంద్రబాబు గారంటే ఏమనుకున్నారు... అంబానీలు, ఆదానీలకే వ్యాపారంలో మెళకువలు నేర్పుతారు. ఇప్పుడు అమరావతి బాండ్ల విషయమే చూడండి. ఆ సక్సస్ లో సీక్రెట్ ఏమిటో తెలుసా... జాతీయ బ్యాంకులు అన్ని 6 లేదా 7 శాతం వడ్డీ ఇస్తుంటే మా బాబు గారు 10.32 శాతం ఇస్తామన్నారు. అంతే కాదు ఈ బాండ్ల కాల పరిమితి పదేళ్లు... మొదటి ఐదేళ్లవరకు 10.32 శాతం  వడ్డీ... ఆ తర్వాత ఆరో ఏట నుంచి పెట్టుబడిపై 20 శాతం ఇన్సెంటివ్ ఇస్తామన్నారు. ఓ పది లక్షలు పదేళ్లు ఇన్వెస్ట్ చేస్తే ఐదేళ్ల పాటు ప్రతి మూడు నెలలకు 10.32 శాతం వడ్డీ వస్తుంది. ఆరో ఏట  నుంచి ఏడాదికి 2 లక్షలు చొప్పున ఇన్సెంటివ్ వస్తుంది. ఇంకేం ఇన్వెస్టర్లు ఎగబడ్డారు భలే మంచి ఆఫర్ అంటూ... 1300 కోట్ల బాండ్లు బిడ్డింగ్ కి పెడితే కేవలం కొన్ని గంటల్లోనే 2000 కోట్లకు కొనుగోలు చేశారు...  అంతే కాదండోయ్... ఈ డీల్ నిర్వహించిన బ్రోకర్ కి 17 కోట్లు కమిషన్ కూడా ఇస్తున్నారట. ఏదయినా మన చంద్రబాబు గారు గ్రేట్... ఆయన తెలివితేటలకు  ఈ ముఖ్యమంత్రి పదవి చాలా చిన్నది. ఈ సారి ఎలాగయినా ఆయన్ని ప్రతిపక్ష కూటమి తరపున ప్రధాన మంత్రిని చేసేయాల్సిందే... ఇక్కడ చూసుకోవడానికి ఎలాగూ లోకేష్ బాబు ఉన్నాడుగా... అసలు నా పర్సనల్ ఫీలింగ్  అయితే చంద్రబాబుకు ప్రధాన మంత్రి పదవి కూడా తక్కువే... ఏ వరల్డ్ బ్యాంకు ప్రెసిడెంట్ నో చెయ్యాలి. మన బాబు గారు ఎం.ఏ ఎకనామిక్స్  కదా..  ప్రస్తుతం కొరియా దేశానికి చెందిన  జిమ్ యోంగ్ కిమ్ వరల్డ్ బ్యాంకు 12 వ అధ్యక్షుడుగా ఉన్నాడు. నెక్స్ట్ 13 వ అధ్యక్షుడుగా  భారత దేశానికి ఛాన్స్ ఇవ్వలసిందే... మన చంద్రబాబు పేరును రిలయెన్స్  అంబానీ తో చెప్పి  ట్రంప్ కి రికమెండ్ చేయించేద్దాం... 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: చంద్రబాబును వరల్డ్ బ్యాంకు అధ్యక్షుడిగా చేయాలి Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top