Translate

  • Latest News

    18, ఆగస్టు 2018, శనివారం

    రక్త చరిత్రను తుడిపివేయలేం


    వాజ్ పేయి  భౌతిక కాయం అనంత వాయువుల్లో కలిసిపోయింది. కౌరవ సామ్రాజ్యంలో భీష్మా చార్యుడిలా... నిన్నటిదాకా అంపశయ్యపై ఉన్న వాజ్ పేయి శాశ్వతంగా ఈ లోకం నుంచి నిష్క్రమించారు. పచ్చి నెత్తురు తాగే  హిందుత్వ అరాచక  శక్తుల శిబిరంలో మంచి ముసుగు వేసుకుని, దానికి కవిత్వం పరిమళం అద్ది పెద్దమనిషి అవతారంలో ప్రధాన మంత్రి అయ్యాడు. 1992 లో బాబ్రీ మసీద్ విధ్వంసానికి ఆర్.ఎస్.ఎస్ శక్తులను రెచ్చగొట్టి... ఆ తర్వాత తనకే పాపం తెలియదన్నట్టు...దొంగ నాటక మాడారు.  2002లో  తాను  ప్రధానమంత్రి గా ఉన్న సమయంలో గుజరాత్లో ఇప్పటి ప్రధాని, అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ జరిపించిన మారణ హోమాన్ని  చూస్తూ కూడా మౌన రుషిలా ఉండిపోయాడు. ఆ తర్వాత తాపీగా తన శైలిలో  కవిత్వంతో మొసలి కన్నీళ్లు కార్చారు.  ఇలా  ఎన్నో దురాగతాలకు సాక్షిభూతంగా నిలిచిన ఆ పెద్దాయన గురించి ఇప్పుడు మీడియా ఆకాశానికి ఎత్తేసినా  చరిత్ర లో మాయని మచ్చలుగా మిగిలిపోయిన ఆయన  తప్పిదాలను చరిత్ర నుంచి ఎవరూ  వేరు చేయలేరు. ఓ వైపు హిందుత్వ శక్తులకు ఊతంగా నిలుస్తూనే... ప్రధాన మంత్రిగా అయన ఈ దేశానికి చేసిన ద్రోహం ఇంతా..అంతా కాదు. ఆయన హయాంలో ప్రైవేటీకరణ కొత్త పుంతలు తొక్కింది. డిజిన్వెస్ట్మెంట్ పాలసీని తెచ్చింది ఆయనే.  పోఖ్రాన్ అణు పరీక్ష జరిపించి, కార్గిల్ యుద్ధం పేరుతొ కృత్రిమ దేశ భక్తిని రగుల్కొలిపి దేశ యువతను ఉన్మాదుల్ని చేసాడు. ప్రధానమంత్రిగా  గద్దె దిగి పోతూ...పోతూ ఉద్యోగులను చావు దెబ్బ కొట్టాడు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ పధకం ప్రవేశపెట్టి పోయాడు. ఉద్యోగులకు ఉద్యోగ భద్రత లేకుండా చేసాడు.ఈ తప్పిదాలన్నిటిని ప్రస్తావించకుండా... చనిపోయాడు కదా అని పొగడ్తలతో ముంచేస్తే భావి తరాన్ని అబద్ధాలతో మోసం చేసినట్టు అవుతుంది. రక్త చరిత్రను తుడిపివేయలేం కదా... అందుకే చెప్పక తప్పలేదు. 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: రక్త చరిత్రను తుడిపివేయలేం Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top