Translate

  • Latest News

    20, ఆగస్టు 2018, సోమవారం

    చేతనైతే సాయం చేయండి...అంతేకాని...



    చేతనైతే సాయం చేయండి...అంతేకాని... ప్రకృతి విపత్తుకు కూడా మతాల మురికిని పూసి మీ మూఢత్వాన్ని నిస్సిగ్గుగా బయటపెట్టుకోవద్దు. కేరళలో వరదలు వస్తే...  దానిని మతాలతో ముడిపెట్టడం దారుణం. ఆ రాష్ట్రంలో ఉన్న పద్మనాభ స్వామి ఆస్తుల జోలికి వెళ్ళినందుకే ఈ విలయం చోటుచేసుకుందనడం అవివేకం. కొందరు ఇంకా ముందుకుపోయి ఆ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం కమ్యూనిస్ట్ ప్రభుత్వం కాబట్టే ఈ ప్రళయం సంభవించిందని  వ్యాఖ్యానించడం  ఘోరం. అక్కడ క్రిస్టియన్లు ఎక్కువగా ఉన్నారు కాబట్టి.. ఆ మతాన్ని చులకన చేసేలా వ్యాఖ్యలు చేయడం... దారుణం. మరికొందరు మన తెలుగు రాష్ట్రాల రాజకీయాల్ని కూడా  దానికి అంటగట్టి బ్రదర్ అనిల్ కుమార్ ఎక్కడో తమ మత ప్రచార  సభలో వర్షాన్ని తన ప్రార్థనలతో సభకు ఆటంకం లేకుండా నిలిపివేస్తానన్న వీడియో ని పెట్టి... మరి కేరళలో  ఆపలేదే అని ప్రశ్నించారు. మతం... అది ఏ మతమైనా మూఢత్వం, అజ్ఞానంతో కూడుకున్నదే... అది హిందూ మతమైనా... క్రిస్టియన్ మతమైనా... ముస్లిం మతమైనా.... మతాల మురికిని, మకిలిని మానవత్వానికి పూయెద్దు...  కుల,మతాల ప్రసక్తి లేని మానవత్వ సుగంధ పరిమళాలే అంతిమంగా ప్రపంచంలో మనిషి తత్వాన్ని సజీవంగా ఉంచేది. మతాలన్నీ స్వార్ధంతో కూడుకున్నవి. అవి మనిషి లోని మానవత్వాన్ని మంటకలిపి, రాక్షసత్వాన్ని నిద్రలేపుతాయి.  కేరళలో గత వందేళ్లలో ఏనాడు సంభవించని విధంగా ఘోర ప్రకృతి విపత్తు జరిగింది. అది 1977 లో మన దివిసీమ ఉప్పెన లాంటిది. కాకపోతే అప్పుడు సాంకేతికంగా ఇంత డెవలప్మెంట్ లేక వేల సంఖ్యలో చనిపోయారు. ఇపుడు వందల్లో చనిపోయారు. ఇలాంటి తరుణంలో జరిగిన ఘోరానికి మతాలతో ముడిపెట్టకుండా ఎవరికి వారు తమకు తోచినంత...తోచిన రీతిలో సహాయం చేయగలిగితే చేయండి తప్ప...మతాలకు ముడిపెట్టి తప్పుడు కూతలు కూయొద్దు... 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: చేతనైతే సాయం చేయండి...అంతేకాని... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top