Translate

  • Latest News

    22, ఆగస్టు 2018, బుధవారం

    ఏపీ రాజధాని అమరావతికి వరద ముప్పు పొంచి ఉందా..?


    ఏపీ రాజధాని అమరావతికి వరద ముప్పు పొంచి ఉందా..? 2011 లో కేంద్ర ప్రభుత్వానికి మాధవ్ గాడ్గిల్ సమర్పించిన నివేదిక ప్రకారం అయితే అవుననే చెప్పాలి. గాడ్గిల్ నివేదికలో కేరళలో పాటు, మహారాష్ట్ర, గోవా  కూడా ప్రమాదపుటంచుల్లో ఉన్నాయని స్పష్టంగా పేర్కొన్నారు. అలాగే... ఉభయ తెలుగు రాష్ట్రాలు ఏమంత సురక్షితం కాదని జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ (ఎన్.డి.ఎం.ఏ) వెల్లడించింది.  తెలంగాణలో కృష్ణా నదీ తీరంలో ఉన్న భద్రాచలం, కొత్తగుడెం, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలు,  ఏపీ లో అమరావతి రాజధాని కేంద్రీకృతమై ఉన్న గుంటూరు, కృష్ణా జిల్లాలతో పాటు, రాయలసీమలో ప్రొద్దుటూరు ప్రాంతం, గోదావరి నదీ తీరాన ఉన్న ఉభయ గోదావరి జిల్లాలకు వరద ప్రమాదం ఉందని గాడ్గిల్ కమిటీ స్పష్టంగా పేర్కొంది.  గాడ్గిల్ కమిటీ నివేదికను తుంగలో తొక్కినందునే కేరళలో ఇప్పుడు ప్రళయం సంభవించిందని పర్యావరణ వేత్తలు గగ్గోలు పెడుతున్నారు. అలాగే అమరావతిలో రాజధాని సురక్షితం కాదని శివరామకృష్ణన్ నివేదికను తుంగలో తొక్కి కేవలం నది తీరంలో రాజధాని నిర్మించి తీర భూములన్నీ పర్యాటకం పేరుతొ సింగపూర్, మలేసియా లకు అప్పనంగా అప్పగించేసి, కాసులు మూత కట్టుకోవాలనే దుర్బుద్ధితో ఇక్కడ పచ్చని పంట పొలాల్ని నాశనం చేశారు. భవిష్యత్తులో కృష్ణ నదీ తీరాన సైతం పంపా నది లాంటి ప్రళయం జరిగే ప్రమాదం లేకపోలేదు... ఈ ప్రమాదాన్ని గమనించే సి.ఎం ఇంటికి విపత్తు సంభవించకుండా ఉండేందుకు అధికారులు  ప్రకాశం బారేజ్ దగ్గర 13 అడుగుల వరకు నిల్వ చేసుకునే సామర్ధ్యం ఉన్నప్పటికీ కేవలం 9.5  అడుగులకే పరిమితం చేస్తున్నారు. దీనివల్ల రైతుల పొలాలకు నీరు అందదు. అవును మరి  రైతులు ఏమైపోతేనేం... మన చంద్రబాబు గారి ఇల్లు మాత్రం సురక్షితంగా ఉండాలి అన్నదే అధికారుల యోచన. అంతేకాదు కృష్ణానదిలో ఇష్టం వచ్చినట్టు ఇసుక తవ్వేస్తుండడంతో నది తన ప్రవాహ దిశను మార్చుకుంటోంది. ఇటీవల తరచుగా కృష్ణా నది ప్రవాహం ఈ విధంగా దిశ మారుతోంది. దిశ మార్పులు భవిష్యత్తులో ఎటువంటి ప్రమాదాల్ని తెచ్చిపెడతాయో చెప్పలేం. 

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: ఏపీ రాజధాని అమరావతికి వరద ముప్పు పొంచి ఉందా..? Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top