Translate

  • Latest News

    23, ఆగస్టు 2018, గురువారం

    కాంగ్రెస్ తో టి.డి.పీ దోస్త్ మేరా దోస్త్


    రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని కర్ణాటక కు చెందిన  సీనియర్ కాంగ్రెస్ నాయకుడు దేవరాజ్ అర్స్ ఏనాడో చెప్పారు. ఆయన చెప్పిన మాటను అక్షరాలా నిజం చేస్తున్నారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. శత్రువు శత్రువు మనకు మిత్రుడు అన్నట్టుగా వై.ఎస్.జగన్ కు శత్రువు అయిన కాంగ్రెస్ ను  తన మిత్రుడిని చేసుకోవడానికి తహతహలాడుతున్నారు. ఆయన తహతహ లాడేది కాంగ్రెస్ పై ప్రేమతో కాదు... 2014 లో కాంగ్రెస్ పై అంత వ్యతిరేకత ఉన్నప్పటికి కాంగ్రెస్ కు రాష్ట్రంలో 7 లక్షల ఓట్లు పడ్డాయి. ఇప్పుడు అప్పుడున్నంత  వ్యతిరేకత లేదు కాబట్టి తమ బలం 10 నుంచి 15 లక్షల ఓట్ల దాకా పెరిగాయని కాంగ్రెస్ చెబుతోంది. అసలే బి.జె.పీ, జనసేన దూరమై విలవిల్లాడుతున్న టి.డీ.పీ ఆ మేరకు తనకు మైనస్ అవుతున్న ఓట్లను పూడ్చుకోవడానికి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడానికి తహతహలాడుతోంది. ఎలాగయినా జగన్ ను  అధికారంలోకి రానీయకుండా చేయడమే టి.డి.పీ లక్ష్యం. అందుకే కాంగ్రెస్ వ్యతిరేక పునాదులపై ఎన్.టీ ఆర్ నిర్మించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చంద్రబాబు నిర్దేశకత్వంలో కాంగ్రెస్ తోనే  పొత్తుకు సిద్ధపడుతోంది. పైగా ఇక్కడ పొత్తు పెట్టుకోవడం ద్వారా తెలంగాణ లో కూడా ఆ పొత్తును కంటిన్యూ చేస్తే అక్కడ బలమైన ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెసుతో చేతులు కలిపి పోయినసారి గెలిచిన 15 సీట్లకు తోడు, కనీసం మరో 15 సీట్లల్లో అయినా పాగా వెయ్యొచ్చని ప్లాన్. ఈ ప్లాన్ తో ఏపీ లో అధికారం మరోసారి నిలబెట్టుకోవడంతో  పాటు, తెలంగాణలో బలంగా వేళ్ళు పాదుకొల్పవచ్చనేది మాస్టర్ ప్లాన్. ఎన్నికల రాజకీయాల్లో అపర చాణుక్యుడుగా పేరొందిన చంద్రబాబు వేసిన తాజా ప్లాన్ ఈమేరకు విజయవంతం అవుతుందో వేచి చూడాలి. 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: కాంగ్రెస్ తో టి.డి.పీ దోస్త్ మేరా దోస్త్ Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top