Translate

  • Latest News

    23, ఆగస్టు 2018, గురువారం

    కన్ను మూసిన జర్నలిస్ట్ కురువృద్ధుడు


    భారత దేశ జర్నలిజం చరిత్రలో కురువృద్ధుడు, డేరింగ్ అండ్ డాషింగ్ జర్నలిస్ట్, ప్రముఖ కాలమిస్టు, రాజ్యసభ మాజీ సభ్యుడు, గ్రేట్ బ్రిటన్ మాజీ హైకమిషనర్   కులదీప్ నయ్యర్(95) తన సుదీర్ఘ జీవన ప్రయాణాన్ని చాలించారు.  ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉన్న పంజాబ్ రాష్ట్రంలోని సియోల్ కోట్లో 1923 ఆగస్టు 14 న సిక్కుల కుటుంబంలో  జన్మించిన కుల్దీప్ నయ్యర్ లాహోర్ లో బి.ఏ ఆనర్స్, ఎల్.ఎల్.బీ చదివారు. అనంతరం నార్త్ వెస్ట్ యూనివర్సిటీ లో జర్నలిజం కోర్స్ చేశారు. ప్రధానంగా దేశంలో ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ, సంజయ్ గాంధీల అరాచకాలపై ఆయన నిర్భీతిగా రాసిన వ్యాసాలతో సంచలనం సృష్టించారు. ఇందిరాగాంధీ పుత్ర వాత్యల్యముతో సంజయ్ ను కట్టడి చేయలేకపోతొందని, సంజయ్ అనధికార ప్రధాని గా వ్యవహరిస్తున్నాడని ఘాటుగా విమర్శలు చేశారు.  తత్ఫలితంగా ఎమర్జెన్సీలో కుల్దీప్ నయ్యర్ అరెస్ట్ అయ్యారు కూడా. తన  ముక్కుసూటి రాతల ద్వారా 70, 80 దశకాల్లో నిత్యం  సంచలన జర్నలిస్ట్ గా, వార్తల్లోని వ్యక్తిగా నిలిచారు. మానవ హక్కుల ఉద్యమ కార్యకర్తగా కూడా పనిచేశారు. మన దేశం తరపున బ్రిటన్ లో హై కమిషనర్ గా పని చేశారు.  1996 లో ఐక్యరాజ్యసమితికి ఇండియా తరపున  ప్రతినిధి బృందంలో ఒకడిగా వెళ్లారు. 1997 లో రాజ్యసభ సభ్యుడుగా ఎన్నికయ్యారు. దేశంలో ఉన్న 14 భాషల్లో దాదాపు 80 పత్రికల్లో ఆయన వ్యాసాలు ప్రచురితమవడం విశేషం.  
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: కన్ను మూసిన జర్నలిస్ట్ కురువృద్ధుడు Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top