Translate

  • Latest News

    27, అక్టోబర్ 2018, శనివారం

    హీరో శివాజీని అదుపులోకి తీసుకుని నిజాలు కక్కించాలి


    తెలుగు సినిమా హీరో(ఒకప్పుడు) శివాజీ ని  కేంద్ర ప్రభుత్వం వెంటనే అదుపులోకి తీసుకుని గరుడ పురాణం గుట్టు విప్పాలి. గరుడ పురాణం స్క్రిప్ట్ రచయిత, దర్శకుడు, నిర్మాత ఎవరో నిగ్గు తేల్చాలి. గరుడ పురాణం గురించి శివాజీ నోటితో చెప్పిస్తున్న, వెనక ఉండి కథ నడిపిస్తున్న అసలు వ్యక్తి ఎవరు. నిన్న మొన్నటి దాకా సినిమాలో వేషాలేసుకుంటూ బతికిన శివాజీని ఒక్కసారిగా సమాజ ఉద్ధారకుడిగా చిత్రీకరించడానికి తన వంతు పాత్ర పోషించిన టి.వి. 9 రవి ప్రకాష్ కు శివాజీ మీద అంత అనురక్తి ఎందుకు... రవిప్రకాష్ ద్వారా ఒక వ్యూహం ప్రకారం గత రెండేళ్లుగా శివాజీని హైలైట్ చేయించిన వ్యక్తి ఎవరు.. గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం గొరిజవోలు గ్రామానికి చెందిన... కమ్మ సామాజిక వర్గానికి చెందిన శివాజీ... వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు.... గరుడ పురాణం గురించి... ముందే అతనికి చెబుతున్నదెవరు...ఈ ఏడాది  మార్చి 23న మొదటిసారిగా శివాజీ విలేకరుల ముందు గరుడ పురాణం గురించి చెప్పారు. అయితే మొన్న జగన్ పై హత్యాయత్నం చేసిన శ్రీనివాసరావు, జగన్ బొమ్మలతో ఉన్నట్టు తెలుగుదేశం పార్టీ బయటపెట్టిన ఫ్లెక్సీ పై గరుడ బొమ్మ ఎందుకు వుంది. పైగా అది న్యూ ఇయర్ కు  వేసినట్టు చెబుతున్నారు. అంటే మార్చి 23 కంటే మూడు నెలల ముందే ఈ గరుడ పురాణం స్క్రిప్ట్ తయారైనదా.... హత్యాయత్నం చేసిన వ్యక్తి వై.సి.పీ అభిమాని అయితే  ఆ ఫ్లెక్సీపై వై.సి.పీ జెండానో... ఫ్యాన్ బొమ్మో ఉండాలి కానీ గరుడ బొమ్మ ఎందుకు ఉంది. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు కావాలంటే అర్జెంటుగా శివాజీని అదుపులోకి తీసుకోవాల్సిందే... వాస్తవాలు నిగ్గు తేల్చాల్సిందే... 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: హీరో శివాజీని అదుపులోకి తీసుకుని నిజాలు కక్కించాలి Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top