Translate

  • Latest News

    31, అక్టోబర్ 2018, బుధవారం

    అడ్డంగా బుక్కవుతున్న చంద్రబాబు


    ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో చంద్రబాబు అడ్డంగా బుక్కవుతున్నారు. ఘటన జరిగిన రోజు నుంచి ఇప్పటివరకు వేసిన ప్రతి అడుగు లోనూ తప్పటడుగే... ప్రతి అడుగులోనూ పప్పులో కాలేస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు. పాపం... జగన్ కు రోజురోజుకు పెరుగుతున్న ప్రజాదరణను చూసి, పైగా ఇంటెలిజెన్స్ వర్గాలు ఇస్తున్న రిపోర్టులు, నేషనల్ మీడియా ఇటీవల వెల్లడించిన సర్వేలు చూసి మతి పోయిన చంద్రబాబు ఏంచేయాలో అర్ధం కాక సామ,దాన, బేధ, దండోపాయాల్లో చివరాఖరి అస్త్రంగా ప్రత్యర్థిని భౌతికంగా అంతమొందించడానికి 10 నెలల కిందటే రచించిన గరుడ పురాణంలో అంకానికి తెర లేపారు. ఏ పని చేసినా తన చేతికి మట్టి అంటకుండా చేసే చంద్రబాబు ఏడాది నుంచి జగన్ పాదయాత్ర చేస్తున్నా ఎటువంటి ఆటంకం కల్పించలేదు. ఎందుకంటే ఇక్కడ ఏమి చేసినా అది తన మీదకు వస్తుంది. అందుకే ఎయిర్ పోర్ట్ లో ప్లాన్ చేసాడు. కేంద్రం మీద తోసేయడానికి. పైగాఎయిర్ పోర్ట్ కాంటీన్ తన అనుంగు అనుచరుడు హర్షవర్ధన్ ది. సో అనుకున్న ప్లాన్ అనుకున్నట్టుగా చక్కగా అమలు చేశారు. అంతా ఓ.కే అనుకుంటే జగన్ పక్కకు తిరగడం, మెడ  మీద పడాల్సిన కత్తి పోటు  భుజం మీద పడడంతో జగన్ బతికి బయటపడ్డాడు. ఆ తదనంతర పరిణామాలు... అన్నిటిలో చంద్రబాబు అడ్డంగా దొరికిపోతూనే ఉన్నాడు. 
    1.డి.జి.పీ తొందరపాటు ప్రకటన 
    2.ఫ్లెక్సీల సృష్టి 
    3. లేఖ భాగోతం, అందులో 3 రకాల రాత 
    4. మంత్రులు, ఎం.పీ ల ప్రేలాపనలు 
    5.సీఎం చంద్రబాబు వెకిలి నవ్వుల ప్రెస్ మీట్  
    6. ఎయిర్ పోర్ట్ మా అధీనం కాదనడం. (మరి గతంలో జగన్ ను అదే ఎయిర్ పోర్ట్ లో రాష్ట్ర పోలీసులు ఎందుకు అడ్డుకున్నారో..) 
    7.నిందితుడు జగన్ అభిమాని అని చెప్పడం, మరి జగన్ అభిమానిని టి.డి.పీ లీడర్ కాంటీన్లో ఎలా పెట్టుకున్నారో, అతన్ని టి.డి.పీ ఎం.ఎల్.ఏ వెలగపూడి రామకృష్ణ ఎలా సిఫార్సు చేశాడు. 
    8.టి,డి.పీ నేత, మాజీ ఎం.ఎల్.సీ వై.వీ.బీ రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలు టి.డి.పీ వర్గాలకే ఛీ..ఛీ.. మరి ఇంత దారుణంగా మాట్లాడతారా అని వెగటు పుట్టించేలా చేశాయి. 
    9. చంద్రబాబు తన తప్పు లేకపోతె సి.బి.ఐ విచారణకు ఎందుకు ఆదేశించడనే ప్రశ్నకు సమాధానం లేదు. 
    10. చివరగా నిందితుడు శ్రీనివాసరావు తనకు ప్రాణహాని ఉందని చెప్పడం... పోలీస్ కస్టడీ లో ఉన్న వ్యక్తి ప్రాణహాని ఉందని చెప్పాడంటే కచ్చితంగా అది ప్రభుత్వ వర్గాల నుంచే ఉంటుంది. శ్రీనివాసరావును హత్య చేసి ఆత్మహత్య నాటకం ఆడవచ్చు. తద్వారా సాక్ష్యాలు లేకుండా చేయవచ్చు.
     ఏమి చేసినా చంద్రబాబు మాత్రం చట్టానికి దొరకకపోయినా ప్రజలకు అడ్డంగా దొరికిపోతున్నారు. 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: అడ్డంగా బుక్కవుతున్న చంద్రబాబు Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top