Translate

  • Latest News

    28, జనవరి 2019, సోమవారం

    ఏడు నెలల కిందటే చెప్పిన భిన్నస్వరం


    తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ప్రముఖ సినీ నటుడు నందమూరి తారక రామారావు పెద్ద అల్లుడు, పార్టీ పెట్టిన తొలినాళ్లలో మామకు వెన్నుదన్నుగా నిలబడటమే కాకుండా... తెలుగు యువత కు తొలి  అధ్యక్షుడు అయిన   దగ్గుపాటి వెంకటేశ్వరరావు తన కుమారుడు హితేష్ చెంచురామ్  తో  కలసి  వై.ఎస్.ఆర్.సి.పీ లో చేరబోతున్నారని, హితేష్ కు ప్రకాశం జిల్లా పర్చూరు వై.ఎస్.ఆర్.సి.పీ ఎం.ఎల్.ఏ టికెట్ ఖాయమని ఏడు నెలల కిందటే (జూన్ 21,2018) చెప్పింది భిన్నస్వరం. (అప్పటి లింక్ దీనితో జత చేస్తున్నాం...గమనించగలరు(Daggupati Hitesh | 2019 elections) )
    రాష్ట్ర రాజకీయాలపై ఎప్పటికప్పుడు విభిన్నమైన, విశ్లేషణాత్మకమైన కధనాలు అందిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన పాఠక లోకాన్ని సొంతం చేసుకున్న భిన్నస్వరం వ్యక్తిగత కారణాల రీత్యా  గత కొంత కాలంగా స్వల్ప విరామం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో సాధారణ ఎన్నికల సమర శంఖారావం మోగుతున్న తరుణంలో భిన్నస్వరం సరికొత్త హంగులతో ఫిబ్రవరి నుంచి వెబ్ ఛానల్ గా ప్రజల ముందుకు రానున్నదని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. ఎప్పటిలాగే...కాదు...కాదు మరింత ఎక్కువగా మీ ఆదరాభిమానాలను కోరుకుంటూ... మా ఛానెల్ ను వీలైనంత ఎక్కువ మంది సబ్ స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ...
    మీ భిన్నస్వరం 

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: ఏడు నెలల కిందటే చెప్పిన భిన్నస్వరం Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top