Translate

  • Latest News

    10, ఫిబ్రవరి 2019, ఆదివారం

    బాబును తిట్ట‌డానికి అక్క‌డి నుంచి ఇక్క‌డికి రావాలా..?


    ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా గుంటూరుకు వ‌చ్చిన ప్ర‌ధాని మోడి తాను చేసిన ప‌నుల‌ను ఏక‌ర‌వు పెట్ట‌డం, ఏపీ సీఎం చంద్ర‌బాబును విమ‌ర్శించ‌టానికే అధిగ‌స‌మ‌యం కేటాయించారు. ఎన్నిక‌లకు కొన్ని రోజుల స‌మ‌యం ఉండ‌గానే అన్ని ప్ర‌ధాన ప‌క్షాలు ఎన్నిక‌ల ప్ర‌చారం ముమ్మ‌రం చేశాయి.ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగానే గుంటూరు వ‌చ్చిన మోడీ ‘ఏపీ అక్షర క్రమంలో తొలిస్థానంతో పాటు అన్ని రంగాలలో, అంశాలలో అగ్రగాములైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు, పద్మభూషణ్, దళిత కవి గుర్రం జాషువా, మహాకవి తిక్కన జన్మించిన గుంటూరు ప్రజలకు నమస్కారం...’ అంటూ తెలుగులో ప్ర‌సంగాన్ని ప్రారంభించిన ప్ర‌ధాని త‌న ప్ర‌సంగంలో చేసిన అభివృద్దిని గురించి చెప్పుకున్నారు. త‌న‌దైన చ‌మ‌త్కారంతో టీడీపీ నిర‌స‌న‌ల‌ను సైతం త‌నకు ప్ల‌స్ గా మార్చుకున్నారు. మోడీ గో బ్యాక్ అంటూ చేస్తున్న చేస్తున్న నినాదాల‌కు త‌న‌దైన రీతిలో స‌మాధానం చెప్పారు. అవును  నేను వెళ్లి తిరిగి కూర్చొనేది డిల్లీ పీఠంపైనే అంటూ చ‌మ‌త్క‌రించారు. మ‌రోవైపు న‌ల్ల బెలున్లూ వ‌దిలి టీడీపీ ఇత‌ర ప్ర‌తిప‌క్షాలు నిర‌స‌న వ్య‌క్తం చేస్తే దాన్ని కూడా తిప్పి కొట్టారు. త‌మ విజ‌యానికి దిష్టిచుక్క‌ల్లా ఉన్నాయ‌ని ఎద్దెవా చేశారు. 


    మొత్తం మీద చంద్ర‌బాబు వ్య‌వ‌హారాన్నిబ‌య‌ట పెట్టి, తండ్రితో పాటు కుమారుడిపై కూడా విమ‌ర్శ‌లు గుప్పించారు. ఒకే క‌లిసి సంసారం చేసిన వారికే బ‌య‌ట వారిక‌న్నా త‌ప్పు ఒప్పులు ఎక్కువ‌గా తెలుస్తుంటాయి. బీజేపీతో నాలుగున్న‌ర సంవ‌త్స‌రాలు భాగ‌స్వామి అయిన టీడీపీ గుట్టు మోడీకి బాగానే తెలిసిన‌ట్లుంది. ప్ర‌త్యేక హోదా విష‌యంలో బాబు యూట‌ర్న్ తీసుకొన్నార‌ని చెప్పి విభ‌జ‌న హామీల్లో అత్య‌ధికం  అమ‌లు చేసామ‌ని, ఇచ్చిన డ‌బ్బులకు లెక్క‌లు చెప్ప‌టం లేద‌ని బాబుపైనే నెపం వేసారు. 

    అయితే స‌గ‌టు రాజ‌కీయ నాయ‌కుడిలా కాకుండా ప్ర‌ధాని స్థాయిలో వ‌చ్చిన మోడీపై స‌హ‌జంగా ప్ర‌జ‌ల‌కు ఆశ‌లు ఉంటాయి. కాని ప్ర‌ధాని స‌గ‌టు రాజ‌కీయ‌నాయ‌కుడిలా మాట్లాడి వారి ఆశ‌ల‌ను వ‌మ్ముచేశారు. మోడీ ప‌ర్య‌ట‌న‌తో బీజీపీలో ఏమైనా స్కోర్ పెరిగిందోమే కాని ప్ర‌జ‌ల్లో ఎటువంటి ఉప‌యోగం లేకుండా పోయింది. ఎన్నిక‌ల ముందు అయినా ప్ర‌త్యేక హోదా హామీ ఇస్తారా అని ఎదురు చూసిన వారికి నిరాశే మిగిలింది. మొత్తం మీద ప్ర‌ధాని మోడీ ప‌ర్య‌ట‌న వ‌ల్ల ఏపీ ప్ర‌జ‌ల‌కు ఒన‌గూరింది ఏమిటిన్న ప్ర‌శ్న‌కు స‌మాధానం లేదు. 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: బాబును తిట్ట‌డానికి అక్క‌డి నుంచి ఇక్క‌డికి రావాలా..? Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top