Translate

  • Latest News

    9, ఫిబ్రవరి 2019, శనివారం

    బాబు ఢిల్లీ దీక్ష‌తో ఒరిగేదేముంది...?


    చేసే ప‌నిప‌ట్ల చిత్త‌శుద్ది ఉంటేనే ప్ర‌జాద‌ర‌ణ  సాధ్య‌మౌతుంది. రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా రాష్ట్ర ప్ర‌జ‌ల స్వ‌ప్నం. చిర‌కాల వాంఛ‌. కొన్ని రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప్ర‌జాతీర్పు కోరుతూ ఎన్నిక‌లకు వెళ్ల‌నున్నాయి. అన్ని పార్టీలు ఎన్నిక‌లకు సిద్ద‌మౌతున్న  స‌మ‌యంలో ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు ప్ర‌త్యేక హోదా కోసం ఢిల్లీలో దీక్ష చేస్తున్నారు. బాబు దీక్ష‌తో కొత్త‌గా ఒరిగేదేమిటో తెలియ‌దు. ఒక వేళ బాబు దీక్ష‌కు బ‌య‌ప‌డి కేంద్రం ప్ర‌త్యేక హోదా ప్ర‌క‌టించే అవ‌కాశం ఏలాగు లేదు. కాని ఏకంగా బాబు దీక్ష‌కు రూ. 10 కోట్లు ఖ‌ర్చుపెడుతున్నారట‌. 
    గ‌తం నుంచి చంద్ర‌బాబు ప్ర‌సంగాలు, స‌భ‌ల‌కు జ‌న‌స్పంద‌న అంతంట మాత్ర‌మే. దీనికి తోడు ప్ర‌భుత్వం పై ఉన్న వ్య‌తిరేక‌తతో కూడా ప్ర‌జ‌లు బాబు స‌భ‌ల‌కు దూరంగా ఉంటువ‌చ్చారు. కాని అధికారంలో ఉన్న ప్ర‌భుత్వం జ‌నం లేక వెల‌వెల పోతే ప్ర‌జ‌ల్లో త‌ప్పుడు సంకేతాలు వెళ్తాయ‌ని భావించి అధికారులు, నాయ‌కులు జ‌న‌స‌మీక‌ర‌ణ కోసం ప‌డ‌రాని పాట్లు ప‌డుతుంటారు. ఆర్టీసీ బ‌స్సులు ఏర్పాటు చేసి వారికి భోజ‌న‌వస‌తి, న‌గ‌దు అంద‌జేస్తే త‌ప్పా బాబు స‌భ‌ల‌కు జ‌నం రాని ప‌రిస్థితి నెల‌కొంది. ప్ర‌భుత్వ ఆదేశాల‌తో ఏ స‌భ‌లోనైనా డ్వాక్రా మ‌హిళ‌లు, ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల విద్యార్దులు హ‌జ‌ర‌య్యేలా చూస్తుంటారు. ధ‌ర్మ‌పోరాట ధీక్ష‌ల పేరుతో రాష్ట్రంలో ఏర్పాటు చేసిన దీక్ష‌ల‌కు గాని, న‌వ‌నిర్మాణ‌దీక్ష‌ల‌కు ప్ర‌భుత్వం కోట్లాది రూపాయాల ప్ర‌జాధ‌నాన్ని వెచ్చించింది. 


    ముందే చెప్పుకున్న‌ట్లు చేసే ప‌నిప‌ట్ల చిత్తశుద్ది క‌రువైతే ప్ర‌జాభిమానం పొంద‌టం క‌ష్టం. బాబు గారి విష‌యంలోనూ అదే జ‌రుగుతుంది. ప్ర‌త్యేక హోదాపై చంద్ర‌బాబు అవ‌లింభించ‌న విధానాలు, చెప్పిన మాట‌లు ప్ర‌జ‌లు మ‌రిచిపోలేదు. కేంద్రంలో భాగ‌స్వామిగా ఉండి కూడా ప్ర‌త్యేక ప్యాకేజికి అంగిక‌రించి, ప్ర‌త్యేక హోదా కోసం పోరాటం చేస్తున్న‌వారిని జైళ్ల‌లో పెట్టించిన సంఘ‌ట‌న‌లు ప్ర‌జ‌లు మ‌రిచిపోలేదు. తాను మారి ప్రత్యేక హోదా స్వ‌రం అందుకున్నా ప్ర‌జ‌ల్లో బాబు పోరాటానికి, దీక్ష‌ల‌కు స్పంద‌న క‌రువౌతుంది. ఈ క్ర‌మంలోనే ఉద్యోగ‌సంఘాలు, అధికార పార్టీల నేత‌లకు టార్గెట్లు ఇచ్చి ఢిల్లీ దీక్ష‌కు త‌ర‌లించాల‌ని ఆదేశాలు ఇచ్చారు. ఈ దీక్ష‌ల‌కు వెళ్లే వారికి ఉచిత ప్ర‌యాణ‌వ‌స‌తితో పాటు అన్ని ర‌కాల స‌దుపాయాలు ప్ర‌భుత్వ‌మే క‌ల్పిస్తుంది. త‌న రాజ‌కీయ మైలేజీ కోసం ప్ర‌త్యేక హోదా దీక్ష‌లంటూ ప్ర‌జాధ‌నాన్ని ఇలా ఖ‌ర్చుపెట్ట‌డంప‌ట్ల స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు విన‌విస్తున్నాయి. 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: బాబు ఢిల్లీ దీక్ష‌తో ఒరిగేదేముంది...? Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top