Translate

  • Latest News

    8, ఫిబ్రవరి 2019, శుక్రవారం

    యూట్యూబ్‌కు పాకిన బాబు ప్ర‌చారం




    ఇటీవ‌ల సీఎం చంద్ర‌బాబు అప్ప‌డాలపైనకూడా త‌న బొమ్మ వేసుకొని చ‌రిత్ర సృష్టిస్తే, ఈ ప్ర‌చార కాంక్ష చివ‌రికి యూట్యూబ్ ఛాన‌ల్స్‌కు పాకింది. ఛాన‌ల్ ఏదైనా, అది ఎటువంటిది అయినా ప్రేక్ష‌కుల సంఖ్య‌ను బ‌ట్టి  యాడ్స్ కుమ్మ‌రించారు. బాబు గారి ప్ర‌చార యావ పీక్ స్తాయికి చేరింది. ఇప్ప‌టికే ప్ర‌జ‌లు క‌ట్టే క‌రెంటుబిల్లులు, మున్సిప‌ల్ బిల్లుల‌పై ప్ర‌చారం చేసుకుంటున్న బాబు ఇప్పుడు ఏ ఇంటిని వ‌ద‌ల‌కుండా గోడ‌ల‌పై ప్ర‌చారాలు కొన‌సాగిస్తున్నారు. ప‌ట్ట‌ణం, ప‌ల్లె అనే తేడా లేకుండా అఖ‌రుకు లెటిన్ గోడ‌ల‌పై కూడా బాబు గారి బొమ్మ లేకుండా ఉండ‌టం లేదంటే  ప్ర‌చారం ఏ స్థాయి కొన‌సాగుతుందో అర్ధం చేసుకోవ‌చ్చు. ఎవ‌రు ఎంత‌గా విమ‌ర్శించినా, న‌వ్వుకుంటున్నా ఈ పిచ్చి అంతకంత‌కు పెరిగి పోతుందే త‌ప్పా త‌గ్గే సూచ‌న‌లు క‌నిపించ‌టం లేదు. ఈ క్ర‌మంలో సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డేకొద్ది త‌న గురించి త‌న పార్టీ నుంచి ప్ర‌చారం చేసుకోవ‌టానికి కొత్త మార్గాలు వెతుకునే ఉన్నారు. 


    గ‌తంలో తుఫాను స‌హాయాన్ని, చంద్ర‌బాబు ప‌ర్వ‌వేక్ష‌ణ‌ను కూడా ఆర్టీసీ బ‌స్సుల‌పై ప్ర‌చారం చేసుకొన్న బాబు పండుగ‌ల‌కు ఇచ్చే స‌ర‌కుల‌లో త‌న బొమ్మ‌తో ప్ర‌చారం చేసుకొన్నారు. అన్న క్యాంటిన్లు, చంద్ర‌న్న భీమా, అంద‌రికి ఇళ్లు ఇలా ప‌థ‌కం ఏదైనా బాబు ప్ర‌చారం మాత్రం పీక్ స్థాయిలో చేరిపోతుంది. ఇక స‌న్మానాలు, కృత‌జ్ఞ‌త‌లు అంటూ రోజుల త‌ర‌బ‌డి జాత‌ర కొన‌సాగుతుంది. పాల‌భిషేకాలు , ర్యాలీలు రోజుల త‌ర‌బ‌డి కొన‌సాగుతునే ఉంటాయి. 


    ఎన్నికల సమయంలో ప్రచారాల కోసం పబ్లిక్ వాల్స్ ను ఉపయోగించుకోవడం పరిపాటే. కానీ చంద్రబాబు గారి దూర దురాలోచనల్లో ఈ పబ్లిక్ ప్రాపర్టీలను కూడా పచ్చప్రచారానికి వాడేయాలనే బుద్ధి పుట్టింది. గ్రామాల్లో తమ అభివృద్ధి పనుల గురించి గోడలపై రాయాలంటూ కొత్త ఆర్డరు జారీచేసాడు. అభివృద్ధి చేస్తే అది ప్రాంతానికీ, ప్రజలకు తెలుస్తుంది. గోడలపై రాతలు రాస్తేనే తెలిసే అభివృద్ధి గోడలకు తప్ప ప్రజలకు తెలియదని అర్థం. రెండు రోజుల క్రితం కూడా పొదుపు సంఘాల మహిళలకు చంద్రబాబుకు ధన్యవాదాలు చెబుతున్నట్టుఉన్న ప్రచార పోస్టర్లను అందించారు. ప్రతిపొదుపు మహిళా ఇంటి తలుపులకు వీటిని అంటించుకోవాలంటూ ఆజ్ఞలు జారీ చేసారట‌. ఇది రానున్న రోజుల్లో ఎంత దూరం వెళుతుందో అని పార్టీ సీనియ‌ర్లు భ‌య‌ప‌డుతున్నారు. 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: యూట్యూబ్‌కు పాకిన బాబు ప్ర‌చారం Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top