Translate

  • Latest News

    6, ఫిబ్రవరి 2019, బుధవారం

    మోడీ చేస్తే త‌ప్పు.. బాబు చేస్తే ఒప్పెలా అయ్యింది ?




    రాష్ట్రంలో తెలుగు మీడియా విలువ‌లు నానాటికి ప‌త‌న‌మౌతున్నాయి. న‌వ్వి పోదురు గాక నాకేటి సిగ్గు అన్న చందంగా తమకు ఇష్టమైన వారిని  ప‌ల్ల‌కీలు ఎక్కిస్తూ,  ప్ర‌త్య‌ర్ధుల‌పై బుర‌ద జ‌ల్ల‌టం ఆనవాయితీగా మారింది. ఈ పోక‌డ ఎన్నిక‌ల స‌మ‌యంలో మ‌రింత‌గా పెరిగిపోయింది. ఏపీలో అత్య‌ధిక మీడియా సంస్థ‌లు సీఎం చంద్ర‌బాబు చెప్పుచేతుల్లోనే ఉన్నాయ‌న్న‌ది బ‌హిరంగ ర‌హ‌స్యమే. వీటినే ఎల్లో మీడియా అంటూ ముద్దుగా పిలుచుకోవ‌టం కూడా తెలిసిందే. ఒకే అంశంపై విరుద్దంగా, నిర్ల‌జ్జ‌గా క‌థ‌నాలు వెలువ‌రించ‌టం మీడియా దిగ‌జారుడుత‌నానికి నిద‌ర్శనంగా చెప్ప‌వ‌చ్చు. 

    కేంద్రం ఇటీవ‌ల రెండు నెల‌ల స‌మ‌యానికి పూర్తి కాల బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టింది. ఈ బ‌డ్జెట్ ఎన్నిక‌ల బ‌డ్జెట్ కాబ‌ట్టి నాలుగు సంవ‌త్స‌రాల 6 నెల‌ల కాలంలో ప్ర‌జ‌ల‌ను ఇబ్బందులు పెట్టిన మోడీ స‌ర్కార్ అనేక సంక్షేమ ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెట్టింది. ప‌థ‌కాలు బాగున్నా పూర్తి కాల బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టి ప్ర‌జ‌ల‌ను వంచించ‌టానికి ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు  మేధావులు, తెలుగు మీడియా నుంచి విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. తెలుగు మీడియా మోడీ బ‌డ్జెట్‌పై అనేక విమ‌ర్శ‌లతో క‌థ‌నాలు వండివార్చింది. ఇక్క‌డ తెలుగు మీడియా స‌మ‌ర్ధ‌వంత‌మైన పాత్ర‌నే పోషించింది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఇదే మీడియా ఏపీలో బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టిన‌ప్ప‌డు మాత్రం వ్య‌వ‌హ‌రించిన తీరు విమ‌ర్శ‌ల‌కు దారితీసింది. మేధావులు, ప్ర‌జ‌లు మీడియా తీరును త‌ప్పుప‌డుతున్నారు. 

     కేంద్రంలో మాదిరిగా రోజుల స‌మ‌యంలో ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ తామేమీ  త‌క్కువ తిన‌లేదంటూ  రైతుల కోసం, నిరుద్యోగుల కోసం, వివిధ వ‌ర్గాల ప్ర‌జ‌ల కోసం భారీగా సంక్షేమ ప‌ధ‌కాల‌కు కేటాయింపులు చేశారు. ఇంకే ముంది  సీఎం చంద్ర‌బాబు బ‌డ్జెట్ పై టీవీల్లో స‌మీక్ష‌లు, చ‌ర్చ‌లు కొన‌సాగాయి. బాబు బ‌డ్జెట్ అద‌ర‌హో అంటూ బ్యాన‌ర్ క‌థ‌నాలు ప్రచురించారు. కేంద్రం చేసిన ప‌నినే రాష్ట్ర ప్ర‌భుత్వం చేసిన‌ప్ప‌డు కేంద్రంలో త‌ప్పు అనిపించిన అంశాలు, రాష్ట్రంలో ఎందుకు త‌ప్పుకాదు...అనే వివేకం వ‌దిలివేశారు. భాజాలు, బాకాల‌తో పేజీలు నింపేశారు. తాను చేస్తే సంసారం.. అవ‌త‌లివారు చేస్తే వ్య‌భిచారం అన్న రీతిలో కొన‌సాగిన ఈ త‌తంగంలో ఎల్లో  మీడియా త‌న ముసుగులు వ‌దిలి బాబు గారి భ‌జ‌న‌లో త‌రించింది.
    మీడియా నుంచి, ప‌త్రిక‌ల గురించి మ‌హాక‌వి శ్రీ‌శ్రీ పెట్టుబ‌డి, క‌ట్టుక‌థ‌ల‌కు పుట్టిన విష‌పుత్రిక‌లు ఈ ప‌త్రిక‌లు అని వ్యాఖ్యానించారు. ఇప్పడు దాన్ని మనం కళ్లారా చూస్తున్నాం. 
    ఏపీ సీఎం చంద్ర‌బాబు మీడియా మేనేజ్‌మెంట్‌లో దిట్ట అన్న విష‌యం విదిత‌మే. విప‌క్ష  వైఎస్సార్ పార్టీకి ఒక్క సాక్షి మీడియా మాత్ర‌మే మ‌ద్ద‌తుగా నిలుస్తోంది. ఈ క్ర‌మంలో రాష్ట్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఏ ప‌త్రిక‌ల్లోనూ ఒక క‌థ‌నం రాదు. చంద్ర‌బాబు ఫోటోలు లేకుండా ఒక్క‌రోజు కూడా మీడియాలో కొన‌సాగ‌దు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను వెలుగులోకి తీసుకురాకుండా, వారి పోరాటాలు బ‌య‌ట‌కు రాకుండా క‌నీసం ప్ర‌శ్నించే వీలు  లేకుండా బాబు అనుకూల మీడియా వ్య‌వ‌హ‌రిస్తుంది. వీరి అంతిమ ధ్యేయం ఒక్క‌టే తాము న‌మ్ముకొన్న బాబుపై ఈగ వాల‌కుండా చూసుకోవ‌టం, ప్ర‌త్య‌ర్ధి పార్టీలు చేసే విమ‌ర్శ‌ల‌ను స‌మ‌ర్ద‌వంతంగా తిప్పికొట్ట‌డం. ఈ విష‌యంలో ఎల్లోమీడియా స‌మ‌ర్ధ‌వంతంగానే ప‌నిచేస్తుంది. అందుకే  అట్ట‌డుగున ఉన్న ప్ర‌జ‌ల క‌ష్టాలు, వారి క‌న్నీళ్లు వెలుగులోకి రావు. తెలుగు మీడియా ప్ర‌శ్నించే త‌త్వాన్ని కోల్పోయిన‌ప్ప‌డు ఆ పాత్ర‌ను నేడు సోషల్  మీడియా స‌మ‌ర్ద‌వంతంగా పోషిస్తోంది. సోష‌ల్ మీడియా నేడు ప్ర‌భుత్వాన్ని నిద్ర‌లేకుండా చేస్తోంది. సామాన్యుడే విలేక‌రిగా మారి ప్ర‌భుత్వ త‌ప్పుల‌ను ఎత్తి చూపుతున్నాడు.  శహభాష్ ... సోషల్ మీడియా...  


    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: మోడీ చేస్తే త‌ప్పు.. బాబు చేస్తే ఒప్పెలా అయ్యింది ? Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top