Translate

  • Latest News

    5, ఫిబ్రవరి 2019, మంగళవారం

    యాత్ర మూవీ వైఎస్సార్‌సీపీ విజ‌యానికి ఊత‌మిచ్చేనా...




    ఆంధ్ర‌ రాష్ట్రంలో త‌న కంటూ ప్ర‌జ‌ల్లో బ‌ల‌మైన ముద్ర వేసుకొన్న మహానాయ‌కుడు దివంగ‌త ముఖ్య‌మంత్రి డాక్ట‌ర్ వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి అని చెప్ప‌వ‌చ్చు. ఎవ‌రు అవున‌న్నా కాద‌న్నా ఆయ‌న ప్రవేశ‌పెట్టిన సంక్షేమ ప‌థ‌కాలు రాష్ట్ర చ‌రిత్ర‌లో ఒక విప్లవం. పేద ప్ర‌జ‌ల‌కు   విద్య‌, ఆరోగ్యం, సొంతింటి క‌ల నిజం చేసిన వ్య‌క్తి అయ‌న‌. వైఎస్ జీవితంలో పాద‌యాత్ర  రాష్ట్రంలో కొత్త అధ్య‌యనానికి దారితీసింది. ఆయ‌న జీవితంలోని కొన్ని సంఘ‌ట‌న‌ల‌ను ఆధారం చేసుకొని యాత్ర సినిమా విడ‌ద‌ల కానుంది. 
    జీవిత చ‌రిత్ర‌ల‌కు అనుగుణంగా నిర్మించే అన్ని సినిమాలు విజ‌యం సాధించవు. అందరికి  వ్యక్తి గురించి ఉన్నది ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తేనే ప్రజలు దాన్ని స్వీకరిస్తారు. మహానటి అందుకే విజయం సాధించింది. కధానాయకుడు లో కేవలం ఎన్టీఆర్ ను హీరోగా ఎలివేట్ చేయడానికే చూసారు తప్ప... ఆయన బయోపిక్ లా తీయలేదు. అందుకే ఇటీవ‌ల విడుద‌లైన ఎన్‌టీఆర్ బ‌యోపిక్  అనుకున్నంత‌గా విజ‌యం సాధించ‌లేక‌పోయింది. ఈ క్ర‌మంలో ఇప్పుడు వస్తున్న యాత్ర సినిమాలో సూపర్ స్టార్ మమ్ముట్టి వైఎస్ పాత్రలో నటిస్తుండగా, మహి.వి.రాఘవ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఈనెల 8న విడుదల కాబోతోంది. వైఎస్ అభిమానులు ఈ సినిమా మీద ఆసక్తిగా వున్నారు. ఇప్పటికే విడుదలయిన టీజర్, ట్రయిలర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి.

    యాత్ర సినిమా అసిస్టెంట్ డైరెక్ట‌ర్   ఈ చిత్రం ప్రిరిలీజ్  ఈవెంట్‌లో చెప్పిన మాట‌లు రాజ‌శేఖ‌ర‌రెడ్డిపై స‌గ‌టు జీవి ప్రేమ‌ను, ఆపాయ్య‌త‌ను స్పష్టం చేశాయి. ..... చదువుతున్నప్పుడు మా అమ్మకి గుండె నొప్పి వస్తే హైదరాబాద్ ఆస్పత్రికి తీసుకొచ్చాం. గుండెలో హోల్ ఉంది. 6 నెలల కంటే ఎక్కువ బతకదని చెప్పారు. అంత స్థోమత లేదని తిరిగి మా ఊరు బస్సులో వెళ్తుంటే.. ఏ తల్లీ కొడుకుని కోరని ఒక కోరిక మా అమ్మ నన్ను అడిగింది. 'మూడు లక్షలు అప్పు తెచ్చి నాకు ఆపరేషన్ చేయించు. నాకొక ఐదారేళ్లు బతకాలని ఉంది. మీరు చిన్న పిల్లలు' అంది. అని వివ‌రిస్తు గుడి, చర్చి, మసీదు ఏది కనిపించినా మా అమ్మ 'ఐదారేళ్లు బతికితే చాలు. నా పిల్లలు చిన్నవాళ్లు' అని మొక్కుకునేది. కానీ ఏ దేవుడూ మా మొర ఆలకించలేదు. కానీ 2009లో వైఎస్సార్ అనే దేవుడు నేనున్నాను.. అని ఆరోగ్యశ్రీ పథకం పెట్టారు. ఎల్‌బీ నగర్ కామినేని హాస్పిటల్‌లో ఒక్క రూపాయి తీసుకోకుండా ఆపరేషన్ చేశారు. మేము చాలా పేదవాళ్లం. చిన్న రెండు గదుల ఇల్లుంది. అది కూడా రాజశేఖర్ రెడ్డిగారిచ్చిన ఇందిరమ్మ ఇల్లే. మా ఇంట్లో ఏ దేవుడి ఫోటోలుండవు. వైఎస్సార్ ఫోటోలు మూడు కనిపిస్తాయి. ప్రతిరోజు మా అమ్మ నాకు ఫోన్ చేస్తది. పదేళ్లకు ముందు ఆగిపోవాల్సిన మాట ఇప్పటికీ నాకు వినబడుతుందంటే దానికి కారణం వైఎస్సార్. ఈ మాట చెప్పటానికి మా అమ్మను ఇక్కడికి తీసుకొద్దామనుకున్నా...అంటూ అత‌ను చెప్పిన మాట‌లు ప్ర‌తి ఒక్క‌రిని కంట‌త‌డి పెట్టించాయి. 

     ఈ సినిమాకు సంబంధించి కొన్ని స‌న్నివేశాల‌ను ప్రోమోగా విడుద‌ల చేశారు. ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మై న‌డుస్తున్న వైఎస్ పాత్ర‌లో ముమ్మ‌ట్టి జీవించారు. నేను ప్ర‌జ‌ల‌కు విధేయుడుని అంటూ ప్ర‌జ‌ల కోసం ప‌రిత‌పించిన విధానం, నాకు వినపడుతుందయ్యా..’ అంటూ పేద రోగి క‌ష్టాలు విని చ‌లించిన వైఎస్ పాత్ర‌లో ముమ్మ‌టి ఒదిగి పోయారు. మొత్తం మీద యాత్ర మూవీ వైఎస్సార్‌సీపీకి ఎన్నిక‌ల వేళ ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ఆ పార్టీ నేత‌లు భావిస్తున్నారు. 


    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: యాత్ర మూవీ వైఎస్సార్‌సీపీ విజ‌యానికి ఊత‌మిచ్చేనా... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top