Translate

  • Latest News

    4, ఫిబ్రవరి 2019, సోమవారం

    స‌ర్వేలతో నేత‌ల త‌ల‌రాత‌లు మారుతాయా...?




    స‌ర్వేలు ... ఇప్పుడు హాట్ టాపిక్‌. రాష్ట్రంలో ఎటుచూసినా ఇదే అంశంపై చ‌ర్చ న‌డుస్తుంది. ఓట‌ర్ల జాబితాను త‌మ ట్యాబ్‌లో ఎక్కించుకొని స‌ర్వేలు చేస్తున్న యువ‌కులు రాష్ట్రంలో ప్ర‌తి చోట క‌నిపిస్తున్నారు. ఓట్ల తొల‌గింపుకోసం టీడీపీ పాల్ప‌డుతుంద‌ని వైసీసీ ఆరోపిస్తున్నారు. ఇది అలా ఉంచితే అధికారంలో ఉన్న పార్టీ తమ ప్ర‌భుత్వ ప‌నితీరుపై ఫోన్ల‌ద్వారా, నాయ‌కుల ప‌నితీరుపై త‌న సొంత వ్య‌వ‌స్థ ద్వారా స‌ర్వేలు చేయించుకుంటున్నాయి .బాబుకు స‌ర్వేల‌పై పిచ్చ న‌మ్మ‌కం. త‌న వ‌ద్ద ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల ప‌నితీరును  బేరిజు వేస్తుంటారు. ఈ విష‌యాన్ని  కొంద‌రు బాబు వారిని ఇలా బ్లాక్ మెయిల్ చేస్తుంటార‌ని చెప్పుకుంటారు. స‌ర్వేలు స్ప‌ష్ట‌మైన ప్ర‌జాభిప్రాయాన్ని ప్ర‌తిభిస్తాయా..? ఈ స‌ర్వేల‌ను న‌మ్ముకుంటే విజ‌యంపై ధీమా పెరుగుతుందా..?  ప్ర‌జ‌ల‌పై స‌ర్వేల ప్ర‌భావం ఉంటుందా..? 

    గ‌త కొంత కాలంగా రాష్ట్రంలో నిర్వ‌హించిన అనేక స‌ర్వేలు అధికార ప‌క్షానికి వ్య‌తిరేకంగానే ఫ‌లితాలు అందిస్తూ వ‌చ్చాయి. విప‌క్ష వైసీసీకి విజ‌యా అవ‌కాశాలు ఉన్నాయ‌ని స్ప‌ష్టం చేశాయి. జాతీయ స‌ర్వేలు కూడా ఎంపీ సీట్ల విష‌యంలో వైసీసీ ముందంజ‌లో ఉన్న‌ట్లే తేల్చి చెప్పాయి. ఈ స‌ర్వేలు చూసి వైసీసీ నేత‌లు ఊహాల లోకంలో విహ‌రిస్తుంటే , తెలుగు త‌మ్ముళ్లు కూడా ఆనందంగానే ఉన్నారు. ప్ర‌భుత్వ ప‌రంగా చేసిన స‌ర్వేల‌లో టీడీపీవైపే అత్య‌ధిక ప్ర‌జ‌లు మొగ్గు చూపుతున్నారట‌. స్వ‌యాన రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అనేక సంద‌ర్బాల‌లో ప్ర‌జ‌ల్లో ప్ర‌భుత్వ ప‌నితీరుపై అత్య‌ధిక మంది ప్ర‌జ‌లు సంతృప్తిగానే ఉన్నార‌ని, విజ‌యం త‌మ‌దే అన్న‌ట్లు చెప్పుకొచ్చారు. ఇక్క‌డే విచిత్ర‌మైన ప‌రిస్థితి క‌నిపిస్తుంది. ప్ర‌భుత్వ ప‌రంగా ప్ర‌జ‌ల్లో సంతృప్తి ఉంటే వైసీసీ వైపు ప్ర‌జ‌లు మొగ్గుతారు. వైసీసీకి విజ‌యాకాశాలు ఎలా సాధ్యం అన్న‌దే ప్ర‌శ్న‌. ఇక్క‌డే మ‌నం ఒక విష‌యం చెప్పుకోవాలి. ఏ పార్టీకి ఆ పార్టీ స‌ర్వేల ఫ‌లితాల‌పై అంత‌గా న‌మ్మిన‌ట్లు క‌నిపించ‌టం లేదు. స‌ర్వే ఫ‌లితాలు ప్ర‌జ‌లకు అన్న రీతిలో ప్ర‌జ‌ల‌పై రుద్ది త‌మ ప‌ని తాము చేసుకుంటు వెళ్తున్నారు. గ‌తంలో మాదిరి ప్ర‌జ‌లు కూడా స‌ర్వేల‌ను అంత‌గా విశ్వ‌సించిన‌ట్లు క‌నిపించ‌టంలేదు. తెలంగాణా ఎన్నిక‌ల స‌మ‌యంలో స్ప‌ష్ట‌మైన ప్ర‌జాభిప్రాయాన్ని ప్ర‌తిభించాల్సిన ల‌గ‌డ‌పాటి స‌ర్వే చంద్ర‌బాబుకు అనుకూలంగా మ‌రల్చిన విష‌యం విదిత‌మే. 

    ఏ స‌ర్వే అయినా నూటికి నూరు శాతం ప్ర‌జాభిప్రాయాన్ని ప్ర‌తిభించ‌దు అన్న‌ది వాస్త‌వం. అధికారంలో ఉన్న పార్టీకి ప్ర‌జ‌ల‌కు ఎందుకు దూర‌మ‌య్యాం... వారిని చేరుకోవ‌టానికి ఏం చేయాల‌న్న అవ‌కాశం ఉంటుంది. ప్ర‌తిప‌క్షంలో ఉన్న పార్టీకి కూడా విజ‌యానికి  ప్ర‌జాభిమానం పొంద‌టానికి ఇంకేం చ‌ర్య‌లు తీసుకోవాలి. ప్ర‌జా వ్య‌తిరేక‌త‌ను ఎలా క్యాష్ చేసుకోవాల‌న్న విష‌యం కూడా స్ప‌ష్ట‌మౌతుంది. అంతే కాని స‌ర్వేలు నూటికి నూరు శాతం ప్ర‌జ‌ల మ‌న‌స్సుల‌ను మారుస్తాయి అనుకోవ‌టం భ్ర‌మే అవుతుంది. 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: స‌ర్వేలతో నేత‌ల త‌ల‌రాత‌లు మారుతాయా...? Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top