Translate

  • Latest News

    16, ఫిబ్రవరి 2019, శనివారం

    పవన్ ను నమ్ముకుంటే కుక్క తోక పట్టుకుని గోదారి ఈదినట్టే..


    పవన్ ను నమ్ముకుంటే కుక్క తోక పట్టుకుని గోదారి ఈదినట్టే.. అని కాపు సామాజిక వర్గ నేతలకు బాగా అర్ధమైనది. 2009 లో ఒక సారి అన్నయ్య చిరంజీవిని నమ్ముకుని ఆ కులం నట్టేట మునిగింది. నడి సంద్రంలో నావను వదిలేసి, పార్టీని ఏకంగా కాంగ్రెస్ లో కలిపేసి చేతులు దులుపుకున్నాడు. 2014 లో తమ్ముడు వచ్చాడు...ప్రశ్నించడానికే వచ్చాను అన్నాడు...  ఆ తర్వాత మనం 2019 ఎన్నికలకు చూసుకుందాం...ప్రస్తుతం అనుభవజ్ఞుడైన చంద్రబాబును గెలిపిద్దాం అన్నాడు... కులం....కులం మొత్తం ఆయన మాటలు నమ్మి.... చంద్రబాబును నెత్తిన పెట్టుకుంది. ఆయన ఏం చేశాడు... తన సొంత సామాజిక వర్గానికే పెద్ద పీట వేశాడు.

    ముద్రగడ మౌనం... 


    వంగవీటి మోహన రంగా హత్య అనంతరం కాపు కులానికి పెద్ద గా ఉన్న ముద్రగడ కాపు రిజర్వేషన్ల ఉద్యమాన్ని ఒక పీక్ దశకు తీసుకువెళ్లి ఆయనా కాడి వదిలేశాడు. తుని లో రైలు దగ్ధం ఘటనను సాకుగా చూపించి చంద్రబాబు  కాపులను అరాచక శక్తులుగా తన ఎల్లో మీడియా ద్వారా ప్రజల్లో చిత్రీకరించడంలో సఫలీకృతుడయ్యాడు. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడ్డాక తన చేతిలో లేని ఓ.బి.సి రిజర్వేషన్లలో 5 శాతం ఇస్తానని మభ్యపెట్టడానికి మరో ప్రయత్నం చేస్తున్నాడు.ఇంత జరుగుతున్నా ముద్రగడ మౌనం వీడకపోవడం ఆ వర్గానికి అంతు పట్టడం లేదు.

    రెంటికి చెడ్డ రేవడి వంగవీటి రాధ... 


    కాపు కులానికి దేవుడు లాంటి  వంగవీటి మోహన రంగా తనయుడు వంగవీటి రాధా కు తండ్రి ఫైర్ లో ఓ పావు వంతు ఫైర్ అతనిలో ఉన్నా కాపు సామాజికవర్గం ఆయన్ను నెత్తిన పెట్టుకుని పూజించేది. ఆ తండ్రి కడుపున పుట్టి.. కుటుంబ పరంగా ఎవరికీ రాని గొప్ప అవకాశాన్ని అందిపుచ్చుకోవడంలో దారుణంగా విఫలం అయ్యాడని ఆ సామాజిక వర్గ నేతలే అంగీకరిస్తున్నారు. తండ్రి ఇమేజి తో ఎన్నాళ్ళు మేనేజ్ చేయగలడు.... వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ఆయన్ను యువజన విభాగానికి రాష్ర్ట్ర అధ్యక్షుడిని చేసినా ఆ పదవిని ఉపయోగించుకోలేదు. ఇప్పుడు విజయవాడ సెంట్రల్ సీటు ఇవ్వలేదని అలిగి పార్టీ వదిలి వెళ్ళిపోయాడు. వెళ్ళినోడు  ఊరికినే వెళ్లాడా... వెళతా .వెళతా  జగన్ మీద బురద చల్లి వెళ్ళాడు. అక్కడితో ఆగాడా ... రంగా హత్యతో పాపం అసలు తెలుగుదేశం కు సంబంధమే లేదు అన్నాడు.. ఆ ఒక్క మాటతో కొద్దో..గొప్పో కాపు సామాజికవర్గం రాధా మీద పెట్టుకున్న ఆశలన్నీ కుప్పకూలిపోయాయి.
    వై.ఎస్.ఆర్.సీ.పీ బాట పడుతున్న కాపు నాయకులు
    ఇక మొన్నటిదాకా ప్రగల్భాలు పలికిన  మన ఉత్తర కుమారుడు పవన్ కళ్యాణ్ ఎన్నికలు ముంచుకొస్తున్న  ఈ తరుణంలో పార్టీ కమిటీల నియామకం అంటూ పూర్తిగా ఇన్ డోర్ పాలిటిక్స్ లో ఉండిపోయాడు.  జనం లోకి రావడం లేదు. మరో పక్క చంద్రబాబు దగ్గర ప్యాకేజి తీసుకుని కామ్ అయిపోయాడనే వదంతులు వినిపిస్తున్నాయి. ఈ ఉత్తర  కుమారుడిని చూసి పాపం సవ్యసాచి అర్జునుడు అనుకుని భ్రమ పడిన కాపు సామాజిక వర్గానికి ఇప్పుడిపుడే భ్రమలు తొలగుతున్నాయి.  పవన్ కళ్యాణ్ ను నమ్ముకుంటే కుక్క తోక పట్టుకుని గోదారి ఈదినట్టే.. అని బాగా అర్ధమవుతోంది. మొదటి నుంచి సీరియస్ గా రాజకీయాల్లో ఉన్న సీనియర్ కాపు రాజకీయ వేత్తలంతా ఈ విషయాన్ని ఈ పాటికే గ్రహించారు. దీంతో ఒక్కొక్కరూ వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ బాట పడుతున్నారు. ఇప్పటికే చీరాల ఎం.ఎల్.ఏ  ఆమంచి కృష్ణమోహన్, అనకాపల్లి ఎం.పీ అవంతి శ్రీనివాస్ వై.ఎస్.ఆర్.సి.పీ లో చేరిపోయారు. రానున్న మూడు, నాలుగు రోజుల్లో మరి కొంతమంది కాపు నేతలు కూడా వై.ఎస్.ఆర్.సీ.పీ లో చేరనున్నారని బలంగా వినిపిస్తోంది. 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: పవన్ ను నమ్ముకుంటే కుక్క తోక పట్టుకుని గోదారి ఈదినట్టే.. Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top